గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలుకు చేరింది. దీంతో సామాన్యులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ఆలొచిస్తున్నారు. పెట్రోల్ ధరలకు భయపడి బయటకు రావడమే మానేశారు. పెట్రోల్ ధరలకు భయపడిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి 10 వేల రూపాయలు ఖర్చుచేసి జట్కాబండిని తయారు చేసుకున్నాడు. స్వతహాగా అతను రజకుడు కావడంతో నిత్యం దుస్తులను సేకరించేందుకు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో రజకుడు సురేష్ తనదగ్గర ఉన్న గాడిదెను జట్కా బండికి కట్టి రాయదుర్గం వీధుల్లో ప్రయాణం చేస్తున్నాడు. మోటార్ వాహనాల వీల్స్ బండికి పెట్టడంతో బండి వేగంగా పరుగులు తీస్తున్నది. ఇకపై పెట్రోల్‌కు బయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు సురేష్.