ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్రదర్శించినపుడు వారు వెలుగులోకి వస్తుంటారు. కొంతమంది ఇనుప ముక్కలను, గాజు ముక్కలను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి అందరికంటే భిన్నంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన శరీరంపై 85 స్పూన్లను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శరీరంపై స్పూన్లను పేర్చి అవి కిందపడకుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్యపడే పనికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి…
కరోనా కాలంలో పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరుగుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ఎలాంటి సందడి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ పెళ్లి పూలదండ కారణంగా ఆగిపోయింది. వివాహం సమయంలో వధూవరులు దండలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వరుడు దండను వధువు మెడలో వెయకుండా విసిరేసినట్టుగా వేశాడు. దీనిపై పెళ్లికూతురు అభ్యంతరం చెప్పింది. ఇరు వర్గాలకు చెందిన బంధువులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వధువు తగ్గలేదు.. దండను విసిరేయడం నచ్చలేదని,తనకు ఆ పెళ్లి వద్దని…
ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వర్షం కురిసే సమయంలో వాహనం నడపాలి అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదం ఒకటి మలేషియాలో జరిగింది. ఓ ద్విచక్రవాహనదారుడు రోడ్డుపై వెళ్తుండగా సడెన్‌గా బండి కిందపడిపోతుంది. కిందపడిన వెంటనే వెనుకనుంచి కారు దూసుకొచ్చిన విషయాన్ని గమనించి పక్కకు తప్పుకున్నాడు. ఆ వెంటనే వెనుక…
ఈరోజుల్లో ఒకరిద్దరు సంతానం అంటే సరే అనుకోవచ్చు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా అసలు సంతానం కలగదు. కానీ, ఆ వ్యక్తి ఇప్పటి వరకు 129 మంది సంతానానికి తండ్రి అయ్యాడు. మరో 9 మంది సంతానానికి తండ్రి కాబోతున్నాడు. దీనిని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ, ఆయనకు ఇదే కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయి. ఇంత మందిని ఎలా కన్నాడు అనే డౌట్ రావొచ్చు. స్పెర్మడోనార్ ద్వారా ఆయన ఇంత మందికి తండ్రి అయ్యాడు. ఆధునిక కాలంలో స్పెర్మ్…
సాధారణంగా ఇల్లు ఇల్లులా కట్టుకుంటే నివశించడానికి అనువుగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా, కట్టుకుంటే, అందులో కూడా నివశించవచ్చు. కాకపోతే నివశించేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మామూలు ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాంటిది ఇంటిని తలకిందులుగా కట్టాలి అంటే చాలా కష్టం. అంతేకాదు, అందులోని వస్తువులు కూడా తలక్రిందులుగా ఉంటే… చెప్పాల్సింది ఏముంది సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయమే. కొలంబియాకు చెందిన ఫ్రిట్జ్ స్కాల్ అనే పెద్దాయన ఇంటిని అందరికంటే…
రోడ్డుపై నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఘాట్ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గోవిందా అంటాయి. చిన్న ఇరుకైన కొండ మలుపుల్లో ప్రయాణం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అలాంటి చోట్ల యూటర్న తీసుకోవడం అంటే చాలా కష్టం. ఇలాంటి కష్టమే ఓ వ్యక్తికి వచ్చింది. ఇరుకైన మార్గం ద్వారా కొండ అంచు చివరి వరకు వెళ్లిన ఓ కారు అక్కడి నుంచి యూటర్న్ చేసుకోవడానికి నానా…
మామూలుగా కోతులు చాలా తెలివైనవి. మనుషులను సైతం ఒక్కొసారి బోల్తా కొట్టిస్తుంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనుషులు ప్రవర్తించినట్టుగానే ఒక్కోసారి వానరాలు ప్రవర్తిస్తుంటాయి. అయితే, ఈ కోతి అన్నింటికంటే వెరీ స్పెషల్. అదేలా ఉంటే, మనుషులు చేసినట్టుగానే కూరగాయల వ్యాపారం చేస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఓ కూరగాయల వ్యాపార దుకాణంలోకి ఓ కోతి చోరబడింది. కూరగాయలు అమ్మే వ్యక్తి అక్కడి నుంచి పక్కకు తప్పుకోగానే సదరు కోతి తాను వర్తకుడిగా భావించి అతని…
యూపీలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు విడతల ఎన్నికల కోసం యూపీ అధికారులు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం అధికారులు పల్లె ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, బలియా జిల్లాలో అత్యల్పంగా వ్యాక్సినేషన్ జరిగింది. అక్కడి ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు బతిమాలి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే,…