మామూలుగా కోతులు చాలా తెలివైనవి. మనుషులను సైతం ఒక్కొసారి బోల్తా కొట్టిస్తుంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనుషులు ప్రవర్తించినట్టుగానే ఒక్కోసారి వానరాలు ప్రవర్తిస్తుంటాయి. అయితే, ఈ కోతి అన్నింటికంటే వెరీ స్పెషల్. అదేలా ఉంటే, మనుషులు చేసినట్టుగానే కూరగాయల వ్యాపారం చేస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఓ కూరగాయల వ్యాపార దుకాణంలోకి ఓ కోతి చోరబడింది. కూరగాయలు అమ్మే వ్యక్తి అక్కడి నుంచి పక్కకు తప్పుకోగానే సదరు కోతి తాను వర్తకుడిగా భావించి అతని సీట్లో కూర్చొని కూరగాయలు అమ్మిన విధంగా నటిస్తూ కూరగాయలను తినసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. తమ దగ్గర కోతుల బెడద విపరీతంగా ఉందని, కూరగాయలను పాడు చేస్తున్నాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
Read: దూకుడు పెంచిన టాటా… ఈ ఏడాది మరో కొత్త ఈవీ కి శ్రీకారం…