ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వర్షం కురిసే సమయంలో వాహనం నడపాలి అంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదం ఒకటి మలేషియాలో జరిగింది. ఓ ద్విచక్రవాహనదారుడు రోడ్డుపై వెళ్తుండగా సడెన్‌గా బండి కిందపడిపోతుంది. కిందపడిన వెంటనే వెనుకనుంచి కారు దూసుకొచ్చిన విషయాన్ని గమనించి పక్కకు తప్పుకున్నాడు. ఆ వెంటనే వెనుక నుండి ట్రక్ దూసుకురావడంతో దాని నుంచి కూడా వేగంగా తప్పుకున్నాడు. క్షణాల వ్యవధిలో రెండు ప్రమాదాలన నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు రోడ్డపక్కన పార్క్ చేసిన ఓ కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒళ్లు గొగుర్పొడిచే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read: కీలక పరిశోధన: ఆ దేశాల్లో మరణం కూడా ఒక సమస్యే…