జనవరి 26 వచ్చింది అంటే దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు జరుగుతుంటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశంలోని ప్రజలంతా ఘనంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సమయంలో పిల్లల హడావుడి అంతాఇంతా కాదు. ఇక బిజినెస్ రంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చిన్నారుల గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌ను పోస్ట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్‌ను తలపిస్తూ కొంతమంది చిన్నారులు శబ్దం చేస్తుంటే, మధ్యలో ఓ చిన్నారి సైనికుడిలా కవాతు చేశాడు. చిన్నారుల ఉత్సాహం, వనరులను వినియోగించుకున్న విధానం తనను ఆకట్టుకుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అయితే, ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందనే విషయం ఆనంద్ మహీంద్రా స్పష్టం చేయలేదు.
Read: ఫిలిప్పిన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు…డీల్ విలువ ఎంతంటే…