సాధారణంగా మన బరువుకంటే ఎత్తైన రాళ్లను ఎత్తాలి అంటే కొంత కష్టమే. ఎంతటి బలం ఉన్న వ్యక్తులైనా సరే కొంత మేరకు మాత్రమే బరువులు ఎత్తగలుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అటవీ ప్రాంతంలో 1.37 టన్నుల బరువైన ఓ పెద్ద బండరాయి ఉన్నది. దానిని ఎవరైనా సరే ఈజీగా ఎత్తివేయవచ్చట. సమతల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక పక్కగా ఎత్తితే కొద్దిగా కదులుతుంది. అంతేకాదు, ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ రాయిని పూర్తిగా…
సముద్ర తీరంలో ఉండే ఇసుక ఎప్పుడూ తడిగా ఉంటుంది. లేదా తీరం నుంచి దూరంగా వెళ్తే అక్కడి ఇసుక పొడిగా ఉంటుంది. రాతి శిలలు శిల్పాల్లా మారడం చూశాం. కానీ ఎక్కడైనా ఇసుక శిల్పాల్లా మారడం చూశారా అంటే లేదని చెప్తాం. ఇసుకతో ఏర్పడిన శిల్పాలను చూడాలంటే అమెరికాలోని లేక్ మిషిగన్ తీర ప్రాంతానికి వెళ్లాలి. లేక్ మిషిగన్ సముద్ర తీర ప్రాంతంలో ఇసుకతో సహజంగా ఏర్పడిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఎలా ఏర్పడ్డాయి… ఎవరైనా నిర్మించారా…
మనిషిని అనుకరించడంలో చింపాంజీలు ముందు వరసలో ఉంటాయి. మనుషులు ఎలాంటి పనులు చేస్తే వాటిని అనుసరించి చింపాంజీలు పనులు చేస్తాయి. ఒక్కోసారి మనుషులను మించి చింపాంజీలు ప్రవర్తిస్తుంటాయి. దుస్తులు ఉతకడం కావొచ్చు బొమ్మలు వేయడం కావొచ్చు… ఎవైనా సరే మనుషులను అనుకరించి చేస్తుంటాయి. అయితే, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ జూను ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే, ఈ జూలో చింపాంజీలకు అక్కడి అధికారులు వెరైటీగా ట్రైనింగ్ ఇచ్చారు. మనుషులు ఎలాగైతే సిగరేట్ తాగుతారో ఆ విధంగా…
చలికాలంలో ఎవరికైనా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలని ఉంటుంది. చన్నీళ్లతో స్నానం చేయాలంటే చలికి తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అయితే, కొంతమంది ఎంత చలిగా ఉన్నా చన్నీళ్లతోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఎంత చలిగా ఉన్నా చన్నీళ్లవైపే మొగ్గు చూపుతారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అయింది. ఓ చిన్న పిల్లవాడు పొయ్యి వెలిగించి దానిపై పెద్ద మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసి దాంట్లోనే కూర్చొని వేడి వేడిగా స్నానం…
కరోనా కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రజలు అనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నారు. పనికోసం పాట్లు పడుతున్నారు. అయితే, బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ అనే వ్యక్తి వెరైటీగా పనిచేస్తే రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అదెలా అంటే, రోజులో గంటల కొద్ది క్యూలైన్లో నిలబడటం. గంటల కొద్ది క్యూలైన్లో నిలబడి తన వంతు వచ్చిన తరువాత కావాల్సివ వస్తువులను కొని తీసుకొని…
దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే దేవుడ్ని నమ్మేవారు ఉన్నాయని, నాస్తికులు లేవని చెబుతుంటారు. దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి అనేక మంది అనేక పరిశోధనలు చేశారు. కొంత మంది వివిధ కోణాల్లో నిరూపించారు కూడా. ఈ నిరూపణలో అశాస్త్రీయత ఉందని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నానని, వాటిని స్వయంగా తరిమికొట్టానని చెబుతున్నాడు ఐఐటి మండీ డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్. 1993లో చెన్నైలో ఉండగా తన స్నేహితుడి కుటుంబాన్ని దెయ్యాలు పీడించాయని, తాను స్నేహితుడి ఇంటికి…
ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాలిబన్ల అకృత్యాలకు ఓ సంగీత విద్వాంసుడు తీవ్రంగా నష్టపోయాడు. తన జీవనోపాధిపై తాలిబన్లు దెబ్బకొట్టారు. సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని అతని కళ్లముందే తగలబెట్టి ఎంజాయ్ చేశారు. పాపం ఆ సంగీత విద్వాంసుడు కంటతడి పెట్టుకుంటే అతనిని చూసి తాలిబన్లు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తూ దారుణానికి ఒడిగట్టారు. చుట్టు ప్రజలు చేరి చోద్యం చూస్తున్నారు తప్పించి ఇదేంటని ఎవరూ ప్రశ్నించలేదు. తాము ప్రజల్లో గొప్ప మార్పును…
వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వారిలో ఒకరు ఆనంద్ మహీంద్రా. కొత్త కొత్త విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఇక జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఓ ఫొటోను షేర్ చేశాడు. క్లాస్‌రూమ్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చొని దిగిన ఫొటోను షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఆడిగిన ప్రశ్నలకు వెరైటీగా ఆనంద్ మహీంద్రా సమాధానం ఇచ్చారు. తనకు ఎనర్జీ లెవల్స్ తగ్గినపుడు క్లాస్‌రూమ్‌కు వచ్చి…
తండ్రి మద్యానికి బానిస కావడంతో ఈ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మానుకోలేదు. తండ్రితో ఎలాగైనా మద్యాన్ని మాన్పించాలని 13 ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్లాన్ ను సిద్ధం చేసుకున్నాడు. తన తండ్రి మద్యానికి బానిస అయ్యాడని, తన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోందని, తన, తన సోదరి చదువుకు ఇది విఘాతంగా మారిందని గ్రామ సభలోని పెద్దలకు ఫిర్యారు చేశాడు. తన సోదరిని ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని అనుకుంటున్నానని,…
దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో…