రోడ్డుపై నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఘాట్ రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గోవిందా అంటాయి. చిన్న ఇరుకైన కొండ మలుపుల్లో ప్రయాణం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అలాంటి చోట్ల యూటర్న తీసుకోవడం అంటే చాలా కష్టం. ఇలాంటి కష్టమే ఓ వ్యక్తికి వచ్చింది. ఇరుకైన మార్గం ద్వారా కొండ అంచు చివరి వరకు వెళ్లిన ఓ కారు అక్కడి నుంచి యూటర్న్ చేసుకోవడానికి నానా తంటాలు పడింది. సాధారణంగా యూటర్న్ తీసుకోవడానికి ఎంత కష్టమైనా ఒకటి రెండు నిమిషాల్లో తీసుకోవచ్చు. కానీ, ఆ కొండ అంచున కారు యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. అత్యంత జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదం జరగకుండా కారు డ్రైవర్ తన స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ యూటర్న్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: ఆ పేలుడు శక్తిని ఊహించడం కష్టమే…హిరోషిమా అణుబాంబుకంటే….
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022