ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్రదర్శించినపుడు వారు వెలుగులోకి వస్తుంటారు. కొంతమంది ఇనుప ముక్కలను, గాజు ముక్కలను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి అందరికంటే భిన్నంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన శరీరంపై 85 స్పూన్లను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శరీరంపై స్పూన్లను పేర్చి అవి కిందపడకుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్యపడే పనికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇలా ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తే, తన శరీరంలోని శక్తిని వస్తువులోకి పంపించడమే దీని వెనుక ఉన్న రహస్యం అని చెప్పుకొచ్చాడు. శరీరంపై 85 స్పూన్లను కిందపడకుండా బ్యాలెన్స్ చేసిన అబోల్ పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నమోదు చేశారు.
Read: తీవ్ర సంక్షోభంలో ఆఫ్ఘనిస్తాన్… పిల్లలకు అన్నంపెట్టలేక…