యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపుకరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలలకు అనుమతులు లేకపోవడంతో నేతలు ప్రచారం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ఒట్లు అడుగుతున్నారు. తాజాగా కాన్పూర్ లోని గోవింద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే సురేంద్ర ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నియోజక వర్గంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన సురేంద్ర అక్కడ స్నానం చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన తీరు, ఆ వ్యక్తి సమాధానం చెప్పిన తీరు ఆకట్టుకుంది. సదరు వ్యక్తి స్నానం చేస్తుండగానే ఎమ్మెల్యే సురేంద్ర కుశల ప్రశ్నలు వేశారు. ఇల్లు ఉందా, రేషన్ కార్టు ఉందా, పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించాడు. సదరు వ్యక్తి సబ్బుతో రుద్దుకుంటూనే సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: ఉక్రెయిన్ సంక్షోభం: యూఎస్ కుటుంబాలను తరలించే పనిలో అమెరికా…
जब नहाते हुए युवक से नेताजी ने मांगा वोट
— News24 (@news24tvchannel) January 13, 2022
कानपुर की गोविंदनगर सीट से BJP विधायक सुरेंद्र मैथानी का चुनाव प्रचार का वीडियो हुआ वायरल #UPElections2022 pic.twitter.com/AWqZpSk12z