కొన్ని అకేషన్స్ సమయంలో పూలకి మహాగిరాకి ఉంటుంది. పండుగల సమయంలోనూ, వేడుకల సమయంలోనూ, పెళ్లిళ్ల సీజన్‌లోనూ పూలకు యమా గిరాకీ ఉంటుంది. పెళ్లిళ్లలో పూలతో అలంకరించడం కంటే బంగారం కొనుగోలు చేయడం మంచిదని అనుకునేంతగా ధరలు ఉంటాయి. పూలు లేకుండా పెళ్లిళ్లు జరగడం కష్టం. పెళ్లిళ్ల సమయంలో చాలా మంది పెళ్లి మండపాలనే కాకుండా కార్లను కూడా పూలతో అలంకరిస్తుంటారు. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన వివాహం సమయంలో వినూత్నంగా అలోచించాడు. పూలతో కారును…
సాంకేతికంగా ప్రపంచం ఎంతగా అభివృద్ది చెందుతుంటే… అంతగా మూఢనమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. రోగాలు నొప్పులకు నాటువైద్యం, పాము కరిస్తే కోడితో వైద్యం చేయడం చూశాం. అప్పట్లో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాము కరిస్తే ఎవరైనా వైద్యుని వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షేర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్రి పాముకాటుకు గురైంది. వంట చెరుకు సేకరణకు వెళ్లిన సమయంలో…
ఇంటిని నిర్మించుకోవాలి అంటే కనీసం రెండు నుంచి నాలుగు సెంట్ల స్థలం అవసరం అవుతుంది. నాలుగు సెంట్ల స్థలంలో ఓ మాదిరి ఇంటిని నిర్మించుకోవచ్చు. అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ, బీహార్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన సంతోష్ అనే తనకున్న ఆరు అడుగుల స్థలంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవున్న స్థలంలో మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడు. తనకు తెలిసిన తాపీ మేస్త్రీని…
కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటుపడిపోయారు. ఉద్యోగాలతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇంటివద్ద నుంచి పనిచేసే సమయంలో కొన్ని సందర్భాల్లో ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం మార్టినెజ్ అనే యువతి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసింది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఆన్‌లైన్ ద్వారానే జరిగింది. ఇంటర్వ్యూలో ఆమెను స్కైవెస్ట్ కల్చర్ గురించి మీ…
ఈ ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే కాదు… ప్రతి ప్రాణి జివించాలి. అన్ని ప్రాణులు జీవించగలిగితేనే ప్రపంచ గమనం ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీకి చెందిన రాకేష్ ఖత్రి అనే వ్యక్తి పక్షుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఢిల్లీలో పక్షుల కోసం ఆయన ఇప్పటి వరకు 2.5 లక్షల గూళ్లను తయారు చేశాడు. వాటిల్లో వేల పక్షలు ఆవాసం ఉంటున్నాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో రాకేష్ ఖత్రి అంటే తెలియని…
సాధారణంగా ఇగ్లూ అనగానే మనకు దృవప్రాంతాలు గుర్తుకు వస్తాయి. అక్కడి ప్రజలు మంచుతోనే చిన్నచిన్న ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఇగ్లూ హౌస్ మోడల్‌లోనే ఇగ్లూ కేఫ్‌ను జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేశారు. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసార్థం ఉన్న ఈ ఇగ్లూ కేఫ్ గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కింది. జమ్మూకాశ్మీర్‌లోని గుల్మర్గ్ లో ఈ కేఫ్‌ను నిర్మించారు. ఈ కేఫ్ నిర్మాణం 64 రోజుల్లో పూర్తయినట్టు నిర్వహకులు తెలిపారు. 25 మంది వర్కర్లు 1700…
కవితకు కాదేది అనర్హం అని శ్రీశ్రీగారు చెప్పినట్టుగా దోచుకోవడానికి దొంగలకు కాదేది అనర్హం అంటున్నారు బీహార్ దొంగలు. బీహార్‌లోని డెహ్రీ పట్టణంలో చారిత్రాత్మకమైన సూర్య గడియారాన్ని దొంగలు దోచుకుపోయారు. 1871లో బ్రిటీష్ పరిపాలన కాలంలో డెహ్రీ పట్టణంలో ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన ఈ గడియారం ఉన్న ప్రాంతం చుట్టూ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉన్నాయి. నిత్యం ప్రజలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు. అంతేకాదు, జిల్లా జెడ్జి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సబ్ డివిజినల్…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈరోజు నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, మొదటిదశ ఎన్నికల్లో నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అందర్నీ అకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తరహా వేషధారణ ధరించిన ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ నోయిడాలోని సెక్టార్ 11 పోలింగ్ బూత్ వద్దకు వచ్చాడు. ఆయన్ను…
రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు బల్లిజాతికి ఓ పెద్ద ఉడుము కనిపించింది. భయపడిన ఆ యువతి వెంటనే అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చి ఎక్కింది. పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు భయపడిన ఆ ఉడుము ఆ యువతి మీదకు దూకే ప్రయత్నం చేసింది. దీంతో మరింత బిగ్గరగా అరడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకు వచ్చి దానిని అక్కడి నుంచి తొలగించే…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఫ్యాషన్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతున్నది. రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు పాపులర్ అవుతున్నారు. గతంలో కండోమ్స్‌తో డ్రెస్సులతో కొందరు పాపులర్ కాగా, ఖాళీ కేఎఫ్‌సీ బకెట్ లతో చేసిన డ్రెస్ వేసుకొని ట్రెండింగ్‌లో నిలిచారు. ఇప్పుడు చిప్స్ ప్యాకిట్స్తో శారీని ధరించి ఓ యువతి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఖాళీ చిప్స్ ప్యాకెట్లను కట్ చేసి వాటితో శారీని తయారు…