హెలికాఫ్టర్లో తిరగాలని ఎవరికైనా ఉంటుంది. రైళ్లు, బస్సులలో తిరగడం అంటే కామన్ అయింది. అయితే, విమానాలు, హెలికాఫ్టర్లో తిరగాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో వధూవరులను హెలికాఫ్టర్లో తీసుకురావాలని అనుకుంటారు. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనీసం అలా వెళ్లాలి అనుకునే వారికోసం ఎదైనా చేయాలని అనుకున్నాడు బీహార్‌కు చెందిన మెకానిక్, ఆర్టిస్ట్ అయిన గుండు శర్మ. తన వద్ద ఉన్న నానో కారుకు హెలికాఫ్టర్‌గా…
యూరప్‌ను ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. యూనిస్ తుఫాను కారణంగా యూరప్‌లోని అనేక దేశాలు వణికిపోతున్నాయి. 190 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో కార్లు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. రోడ్డుమీదకు వచ్చిన మనుషులు గాలికి తట్టుకోలేకి రోడ్డుమీదనే పడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, దేవాన్‌లోని బర్నస్టాపల్‌లోని ఓ కారు పార్కింగ్ వద్ద సిమన్ అనే వ్యక్తి నిలబడి ఉన్నాడు. అయితే, హటాత్తుగా ఈదురుగాలులు వీయడంతో సిమన్ విగ్గుకాస్త ఎగిరిపోయింది. హటాత్తుగా జరిగిన ఆ పరిణామంతో…
టూవీలర్ వాహనం కొనేందుకు డబ్బులను నోట్ల రూపంలో తీసుకెళ్తాం లేదంటే, కార్డ్ ద్వారా పే చేస్తాం. కానీ, ఓ వ్యక్తి స్కూటర్ కొనేందుకు పూర్తిగా చిల్లర డబ్బులను సంచుల్లో నింపుకొని వెళ్లాడు. కావాల్సిన స్కూటీని ఎంచుకొని చిల్లర డబ్బుల సంచులను వారిముందు గుమ్మరించాడు. ఆ చిల్లర డబ్బులను చూసి సిబ్బంది షాక్ అయ్యారు. ఆ చిల్లర డబ్బులు లెక్కవేసే సరికి వారి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. Read: Kim Jong Un: గడ్డగట్టే చలిలో వారిని…
శరీరంపై ఆదనంగా ఏవైనా అవయవాలు ఉంటే వాటిని ఎలాగైనా సరే తీసేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చూసేవారికి ఇబ్బంది లేకపోయినా, వాటిని మోస్తూ తిరిగేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నచిన్న ఇబ్బందులు అంటే సరేలే అనుకోవచ్చు. కానీ, శరీరంపై మోయలేనంతగా అవయవాలు పెరిగిపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి. గుజరాత్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ పొత్తి కడుపులో ఓ ట్యూమర్ ఏర్పడింది. ఆ ట్యూమర్ క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. ఎంతగా పెరిగింది అంటే సుమారు 47 కేజీలు పెరిగింది. కడుపు పెద్దదిగా…
వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్‌గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణవేత్తగా పనిచేస్తున్నది. వాతావరణానికి సంబందించిన రిపోర్ట్‌ను స్టూడియోలో ఉత్తర భాగంలోని లైట్స్ గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, ఆమె లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ అజిత్ నినాజ్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు.…
దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం బోర్డర్ లో పహారా కాస్తుంటారు సైనికులు. మంచు పర్వతాల్లో ప్రాణాలకు తెగించి పహారా చేయడం అంటే మామూలు విషయం కాదు. పైనుంచి దట్టంగా కురిసే మంచుతో ఆ ప్రాంతాలన్ని కప్పబడి ఉంటాయి. మంచులో నడుస్తుంటే కాళ్లు మోకాళ్ల లోతులో కూరుకుపోతుంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు పోయినా సరే దేశంకోసం జవాన్లు కాపలా కాస్తుంటారు. శతృవుల నుంచి దేశాన్ని రక్షిస్తుంటారు. అత్యంత కఠోరమైన వాతావరణంలో సైతం విధులు నిర్వహిస్తూ…
పెంపుడు జంతువులను యజమానులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. వాటి కోసం ఎంత ఖర్చైనా పెడుతుంటారు. యూకేకు చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ అంటే చాలా ఇష్టం. దానితోనే ఎక్కువ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే, కొన్ని రోజులాగా ఆల్ఫీ అనారోగ్యంపాలైంది. తరచుగా వాంతులు చేసుకుంటున్నది. అంతేకాదు, నీరసంగా మారడం, పొట్ట ఉబ్బినట్టుగా ఉండటంతో ఆందోళన చెందిన నీల్ వెంటనే దానిని వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. పరీక్షించిన…
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అనే సాంగ్ గుర్తుంది కదా…అలానే పాపం ఓ చిరుత పులి బద్లాపూర్ జిల్లా గోరెగాన్ ప్రాంతంలోకి వచ్చింది. అడవిలోనుంచి వచ్చిన సంవత్సరం వయసున్న చిరుతపులి వాటర్ క్యాన్‌లో ఏదో ఉందనుకొని తల దూర్చింది. తలైతే దూరిందికానీ ఆ తలను వెనక్కి ఎలా తీయాలో అర్థం కాలేదు. దీంతో పాపం ఆ చిరుత నానా కష్టాలు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 మంది కలిసి 48…
మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. అసలు పక్షులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తాం. కానీ, మెక్సికోలో వందలాది పక్షులు ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాయి. పక్షులన్నీ గుంపుగా కిందపడిపోవడంతో అందులో చాలా పక్షులు రోడ్డుపై పడి మరణించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఫిబ్రవరి 7 వ తేదీన జరిగింది.…
అత్యవసర సమయాల్లో సహాయం కోసం ప్రతీ రాష్ట్రం ఒక్కో నెంబర్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆ నెంబర్‌కు డయల్ చేస్తే పోలీసులు స్పందించి సహాయం చేస్తారు. అయితే, కొంతమంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరదాగా కాల్ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఇటీవలే హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 112ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ తాగుబోతు కాల్ చేశాడు. కాల్ చేసి సహాయం కావాలని…