రోడ్ సేప్టీ విధానాలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాహనాలను అతివేగంగా నడపడం, అజాగ్రత్తగా నడపడం, రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్స్ ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తున్నట్టు సిగ్నల్ పడటంతో గేట్‌మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ, ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా రైలు వచ్చేలోగా క్రాస్ చేసి వెళ్లొచ్చని అనుకున్నాడు. రూల్స్‌ని బ్రేక్…
పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినపుడు రిజర్వాయర్ కింద ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నష్టపరిహారం ఇస్తుంటారు. ఏ దేశంలో తీసుకున్నా రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో గ్రామాల్లోని ప్రజలను తరలిస్తుంటారు. స్పెయిన్‌లో 1990 దశకంలో ఆల్టో లిండోసో అనే రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం అసెరెడో గ్రామంలోని ప్రజలను తరలించారు. 1992లో తరలింపు పూర్తయింది. రిజర్వాయర్ లోకి నీటిని మళ్లించడంతో అసెరెడో గ్రామం పూర్తిగా…
జమ్మూకాశ్మీర్‌లో భారత రైల్వేశాఖ చీనాబ్ నదిపై వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా చీనాబ్ వంతెన పేరు తెచ్చుకున్నది. ఇటీవలే ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను రైల్వేశాఖ, రైల్వేశాఖ మంత్రి షేర్ చేశారు. ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుతమైన కట్టడంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్…
పుష్ప సినిమాలో సామీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ భాష రాకున్నా చాలా మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి వైరల్ అవుతున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా రారా సామీ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో…
చీర కోసం ఓ మహిళ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఓ బిల్డింగ్ 9వ అంతస్తులో ఉండే ఓ మహిళ తన చీరను బాల్కానీలో ఆరేసింది. అయితే, ఆ చీర గాలికి ఎగిరి ఎనిమిదో అంతస్తులో పడింది. కింది అంతస్తులో చీర పడిపోవడాన్ని గమనించిన సదరు మహిళ తన కుమారుడిని 9 అంతస్తు బాల్కాని నుంచి ఎనిమిదో అంతస్తులోకి దించింది. దీనికోసం ఆమె దుప్పటిని తాడులా ఉపయోగించింది. కింది అంతస్తులోకి దిగిన ఆ…
కాన్సెప్ట్ మోడల్‌లో వచ్చిన హోటల్స్ ఈమధ్యకాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. వెరైటీ కాన్సెప్ట్‌తో వినియోగదారులకు ఆకర్షించేందుకు యువత ఉత్సాహం చూపుతున్నది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఖైదీ బిర్యానీ పేరుతో ఓ హోటల్‌ను ప్రారంభించారు. జైలు వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో ఫుడ్ సర్వ్ చేసే వారు ఖైదీ డ్రస్సులు వేసుకొని సర్వ్ చేస్తుంటారు. ఇక ఈ హోటల్‌లో సాధారణ గదులకు బదులుగా గదులను జైలు గదులుగా మార్చారు. ఈ…
భూమిమీత అతిపెద్ద జీవులుగా గుర్తించబడిన రాక్షసబల్లులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయితే, వాటికి సంబంధించిన ఆనవాళ్లు, వాటి శిలాజాలు, గుడ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో రాక్షసబల్లుల గుడ్లు కొన్ని బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బడవాన్ అడవిలో 10 గుడ్లు బయటపడ్డాయి. ఈ గుడ్ల వయస్సు సుమారు కోటి సంవత్సరాలకు పైగా ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు పురాతన శిల్పాలు, కోటలు తదితర వాటిపై సర్వేలు నిర్వహిస్తున్న సమయంలో సెంధ్వా జిల్లాలోని హింగ్వా…
ఆవుపాలు, గేదెపాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే, కొంతమందికి ఈ పాలు పడవు. ఇలాంటి వారు సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ వంటివి తీసుకుంటు ఉంటారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఆలూ మిల్క్ అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డగ్ అనే కంపెనీ ఆలూ మిల్క్‌ను యూకేలో ప్రవేశపెట్టింది. ఈ ఆలూ మిల్క్‌లో వివిధ విటమిన్స్‌తో పాటు రుచికరంగా కూడా ఉండటంతో వీటిని తాగేందుకు యూకే వాసులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఆవులు, గేదెలు వంటి…
మనుషులే కాదు జంతువులు కూడా పగపడుతుంటాయి. పాములు పగపడుతుంటాయని చెబుతుంటారు. అంతేకాదు, ఈగ పగపై ఏకంగా టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. అయితే, కాకులు ఓ కోతిపై పగబట్టడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. కేరళలోని ఎర్నాకులంలో మవట్టుపూజాలో ఓ కోతికి కాకుల గుంపు నరకం చూసిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే వెంటబడి తరుముతున్నాయి. ముక్కులతో పొడుస్తున్నాయి. ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వస్తే వారినిపై కూడా కాకులు దాడి చేస్తున్నాయి.…
కరోనా కాలంలో మాస్క్ ఎంతగా ఉపయోగపడుతుంతో చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ ధరించడం వలనే కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ లేకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు. ఇరాన్ కు చెందిన కార్టూనిస్ట్ ఆయత్ నదేరీ ఇస్ఫాహన్ యూనివర్శిటీలో ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. టీచింగ్ వృత్తితో పాటు ఆయన సృజనాత్మకంగా గీసే కార్టూన్స్ ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్స్ వంటి అకాడమీలను ఏర్పాటు చేసి నిత్యం కార్టున్లపై శిక్షణ…