ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనలో మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ సతీమణి భారతి సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సాహపరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ వేశారు. Read Also:…
ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…
సాధారణంగా అమ్మాయిలకు జంతు ప్రేమ ఎక్కువ ఉంటుంది. మూగ జీవాలు అంటే వారికి ప్రాణం.. ఎక్కువగా కుక్కలు, పిల్లులను ముద్దు చేస్తూ ఉంటారు. ఇక్కడివరకు అయితే ఓకే కానీ మరికొంతమంది అమ్మాయిలు ఒక అడుగు ముందుకేసి విష సర్పాలతో కూడా స్నేహం చేస్తారు. వాటిని ముద్దాడుతూ, పట్టుకుంటూ కనిపిస్తారు.. కొన్నిసార్లు అలాంటివి ఎంత ప్రమాదకరమో ఈ వీడియో తెలుపుతుంది. తాజాగా ఒక యువతి ఇలాంటి సాహసమే చేసింది.. కానీ చివరికి ఆ పాము నోట్లోనే చిక్కుకుపోయింది. ప్రస్తుతం…
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం ఏకంగా బిడ్డ ప్రాణాన్నే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేద్దామని తల్లిదండ్రులు తమ చిన్నారితో కలిసి బైకు మీద బయటకు వచ్చారు. అయితే చిన్నారిని బైక్ నుంచి కిందకు దింపకుండా బండి మీదే కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్డుపై షాపింగ్ చేస్తున్నారు. బైక్ మీద కూర్చున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా… బైకు అదుపు…
తల్లి ప్రేమ ఎవరు వర్ణించలేనిది.. ఆమె ప్రేమలో ఉండే స్వచ్ఛత వేరు.. తల్లీబిడ్డల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కరోజు బిడ్డ కనిపిచ్న్హకపోయిన ఆ తల్లి పడే బాధ చెప్పలేనిది.. తల్లి ప్రేమలోనే కాదు కోపంలోను ఆ ప్రేమే కనిపిస్తోంది. ఇదిగో తాజాగా ఒక తల్లి ప్రేమ ఇలా కనిపించింది. చాలా రోజుల తరువాత కొడుకును కలిసిన ఆనందం.. ఇన్నాళ్లు తనను చూడడానికి రాని కొడుకుపై కోపం రెండు ఒకేసారి చూపించింది. పాకిస్థాన్ ఎయిర్…
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కుక్కలు, పిల్లులు హల్చల్ చేస్తుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. చౌబేపూర్‌లోని ప్రభుత్వ కార్యాలయంలోకి మేక ప్రవేశించి మెల్లగా క్యాంటీన్ పక్కన ఉన్న గదికి చేరుకుంది. గదిలో ఉన్న ప్రభుత్వ ఫైల్‌ను నోటితో పట్టుకుంది. అనంతరం కార్యాలయం బయటకు పరుగెత్తుకు వెళ్లింది. అయితే మేక నోటి వెంట ఫైల్‌ను చూసిన ఓ ఉద్యోగి దాని వెనుక పరిగెత్తాడు. దీంతో అది కీలకమైన డాక్యుమెంట్ ఫైల్ అని భావించిన ప్రభుత్వ ఉద్యోగులకు…
రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమైన విషమే.. అవి కొన్నిసార్లు శృతి మించి ఇంకా ముందుకు సాగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేతల మధ్య రాజకీయాల్లోనైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అందరూ కోరుకునే విషయం. అయితే, తాజాగా ఓ ఎమ్మెల్యే హత్యపై ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది… బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ…
బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.…
వారణాసిలోని వీధుల్లో అడుక్కుంటున్న ఓ మహిళ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆమె పేరు స్వాతి. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న దుకాణం వద్ద టిఫిన్ చేస్తూ స్వాతి ఇంగ్లీష్ మాట్లాడటాన్ని గుర్తించాడు. దీంతో అతడు స్వాతి గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దీంతో అతడు స్వాతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో ఈ వీడియోలను 78వేల మంది వీక్షించారు. స్వాతి సైన్స్ గ్రాడ్యుయేట్…
ప్రస్తుతం ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అంటూ వాటితోనే జీవితం గడుపుతున్నారు. అలాంటి మీడియా గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది పోస్ట్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం 65 మంది మహిళా టీచర్లకు కోపం తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే…