కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం దేశవ్యాప్తంగా శోకసంద్రాన్ని మిగిల్చింది. కేవలం 46 ఏళ్ల వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించడం మిస్టరీగా మారింది. 2021లో తీవ్ర విషాదం నింపిన ఘటనల్లో పునీత్ రాజ్‌కుమార్ మరణం కూడా ఒకటి. పునీత్ ఇక లేరన్న విషయాన్ని అభిమానులే కాదు మీడియాలో న్యూస్ చదివేవాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ న్యూస్ ఛానల్లో పునీత్ మరణవార్త గురించి చదువుతూ ఓ న్యూస్ రీడర్ ఎమోషనల్ అయిపోయింది. ఈ వార్త…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మరణించడంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన భౌతికంగా అభిమానుల మధ్య లేకపోయినా సినిమాల రూపంలో కళ్ల ముందు మెదులుతున్నారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులను ప్రజలు తమ హృదయాల్లో దాచుకున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పునీత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో ప్రధానంగా విధి గురించి పునీత్…
ఆకుకూరలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ భావిస్తారు. దీంతో పలువురు వ్యక్తులు కూరగాయలు బదులు ఆకుకూరలు కొనుగోలు చేస్తుంటారు. కానీ కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆకుకూరల వ్యాపారి చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. సదరు వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను మురుగు నీటిలో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీసి భోపాల్ కలెక్టర్‌కు షేర్ చేశారు. దీంతో…
ఎంత లోకల్ అయినా.. ఒక్కోసారి నాన్ లోకల్ చేతిలో ఓడిపోవాల్సిందే అని నిరూపించే ఘటన ఇది. మొసలికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. అయితే అలాంటి మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపడం సంచలనంగా మారుతోంది. ఆఫ్రికాలోని సఫారీ పార్కులో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన జరిగి రెండునెలలు అవుతున్నా.. ఈ వీడియో మాత్రం…
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ…
రియల్ హీరో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు అండగా నిలువగా.. అప్పటి నుంచి ఎవరి ఏ కష్టమొచ్చిన తన వంతు సాయం చేస్తున్నాడు. ఇదిలావుంటే, సోనూసూద్ ఆరోగ్యం, ఫిట్నెస్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటాడో అందరికి తెలిసిందే.. అయితే తాజాగా అయిన చేసిన ఫిట్నెస్ స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూసూద్ తన రెండు చేతులు నేలపై పెట్టి కాళ్ళు గాల్లోకి లేపాడు.. ఆపై చేతులు కూడా నేలపై…
దెయ్యాల గురించి రకరకాలుగా కథలు చెబుతుంటారు.. కొందరు నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది అంటే.. మరికొందరు.. అక్కడ దెయ్యం ఇలా చేసిందటా? అని చెబుతుంటారు.. దెయ్యం కథలతో వచ్చే సినిమాలకు కూడా మంచి ఆదరణ లేకపోలేదు.. ఇక, అసలు విషయానికి వస్తే.. దెయ్యం క్రికెట్ గ్రైండ్లోకి దిగిందా..? బంతి పడకముందే.. దెయ్యమే వికెట్లు తీస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. చరిత్రలో దెయ్యం తీసిన తొలి వికెట్ ఇదేనంటూ ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు.. ఈ…
భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఆమె ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు గుప్పిస్తోంది. అనారోగ్యం కారణంగా మాలెగావ్ పేలుళ్ల విచారణకు హాజరుకాలేనని చెబుతున్న ఆమె.. పెళ్లి వేడుకలో డ్యాన్సులు చేయడంపై మండిపడుతున్నారు. అయితే, ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఇద్దరు పేదింటి యువతులకు తన ఇంట్లోనే వివాహం జరిపించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఎంపీ కూడా డ్యాన్స్ చేశారు. ఈ…
ఓవైపు ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. తాజాగా ట్విట్టర్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించగా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు…
కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్…