సాధారణంగా రైళ్లు రైలు పట్టాలపై, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. కానీ బెంగళూరులోని ఓ రైల్వేస్టేషన్‌లో బస్సులన్నీ రైలెక్కి కూర్చున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… ఇప్పటివరకు మనం గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాలనే తరలించడం చూశాం. కానీ తొలిసారిగా ఆర్టీసీ బస్సులను అధికారులు గూడ్స్ రైలులో రవాణా చేశారు.
బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన పలు బస్సులు తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే ఎంతో వ్యయం అవుతుంది. దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉండటంతో రైలు మార్గం ద్వారా చాలా చౌకగా రవాణా చేయవచ్చనే ఉద్దేశంతో హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో తరలించినట్లు అధికారులు వివరించారు. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులను గూడ్స్ రైలులో తరలించిన వీడియోను ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Buses on Train!
Transporting passenger buses for the first time. pic.twitter.com/QWggwXfww1
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 18, 2022