ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుత స్పందన వచ్చింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా కూడా అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అంటూ ఓ మేనరిజంను ఫాలో అవుతూ ట్విట్టర్లో పోస్ట్…
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా వుండే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సరదాగా సేదతీరారు. అది కూడా అండమాన్ దీవుల్లో. ఆయన చేసిన స్కూబా డైవింగ్ యువకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ స్కూబా డైవింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇద్దరు యువకుల వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఇద్దరు యువకులు రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై వెళ్తూ హీరో లెవల్లో విన్యాసాలు చేశారు. ఒక యువకుడు బైకు నడుపుతుంటే… మరో యువకుడు అతడి భుజంపై కూర్చుని ఒక చేత్తో సిగరెట్, మరో చేత్తో తుపాకీ పట్టుకుని రాయల్‌గా కనిపించాడు. అయితే వీరు ఈ విధంగా బైకు నడుపుతున్న ఫోటోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయక్ నహీ.. ఖల్…
విజయవాడ సిటీ బీజేపీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు ఆడ, మగ తేడా లేకుండా ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ సినిమా పాటకు చిందులేశారు. వారి వెనుక వైపు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, సోము వీర్రాజులతో కూడిన ఫ్లెక్సీ ఉండగా.. ఆ వేదిక పైనే బీజేపీ నేతలు డ్యాన్సులు వేశారు. Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే ఇటీవలే…
టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో వున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తిరిగి రాని లోకాలకు చేరారు. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఆయన అందరికీ చేయి ఊపుతూ కనిపించారు. ఫరీదుద్దీన్ అకాల…
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎందుకు…
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నాడు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కాసేపు కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక టీమ్ తరఫున కబడ్డీ ఆడుతూ కాలు స్లిప్ కావడంతో కింద పడిపోయారు. స్పీకర్ కిందపడగానే ఆయన సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపారు. Read Also: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా…
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనలో మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ సతీమణి భారతి సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సాహపరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ వేశారు. Read Also:…
ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…
సాధారణంగా అమ్మాయిలకు జంతు ప్రేమ ఎక్కువ ఉంటుంది. మూగ జీవాలు అంటే వారికి ప్రాణం.. ఎక్కువగా కుక్కలు, పిల్లులను ముద్దు చేస్తూ ఉంటారు. ఇక్కడివరకు అయితే ఓకే కానీ మరికొంతమంది అమ్మాయిలు ఒక అడుగు ముందుకేసి విష సర్పాలతో కూడా స్నేహం చేస్తారు. వాటిని ముద్దాడుతూ, పట్టుకుంటూ కనిపిస్తారు.. కొన్నిసార్లు అలాంటివి ఎంత ప్రమాదకరమో ఈ వీడియో తెలుపుతుంది. తాజాగా ఒక యువతి ఇలాంటి సాహసమే చేసింది.. కానీ చివరికి ఆ పాము నోట్లోనే చిక్కుకుపోయింది. ప్రస్తుతం…