సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి.. నెట్టింట్లో రకరకాల ఫన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొందరు వైరల్ అవ్వడానికి కావాలనే ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. మరికొన్ని మాత్రం అలా ఉండవు. సహజంగానే కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి కడుపుబ్బా నవ్వులు తెవ్విస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే…
అదొక పెళ్ళి వేడుక.. ఘనంగా నిర్వహించారు.. బంధువులు, స్నేహితులు అంతా విచ్చేశారు.. అన్నీ అనుకున్న పనులు సవ్యంగా సాగిపోయాయి. ఇక జయమాల వేడుకకి సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా తొలుత వరుడి మెడలో వధువు జయమాల వేసింది. ఆ వెంటనే వరుడు కూడా ఆమె మెడలో జయమాల వేశాడు. అది వేసిన అతగాడు.. ‘హమ్మయ్యా, పెళ్ళైపోయింది’ అని అనుకున్నాడు. అయితే, ఇదే సమయంలో అతనికి ఉన్నట్టుండి ఏసీ లాంటి చల్లటి గాలిని అనుభూతి చెందినట్టు అయ్యింది. ‘అరె, ఇప్పటివరకూ వేడిగా ఉన్న వాతావరణం, సడెన్‌గా చల్లగా ఎలా మారింది’ అని ఆలోచిస్తున్నాడు.
ఇంతలో ఆ వేడుకకి వచ్చిన వాళ్ళందరూ.. ‘ఒరేయ్, నీ ప్యాంట్ ఊడింది వేసుకో’ అన్నట్టు పకపక నవ్వేశారు. అప్పటివరకూ ఏసీ తగులుతోందన్న భ్రమలో ఉన్న ఆ వరుడు, ఒక్కసారిగా తేరుకొని తిరిగి ప్యాంట్ వేసుకున్నాడు. అతని ముందే ఉన్న వధువు ఆ దృశ్యం చూసి, పక్కున నవ్వేసింది. అయ్యో పెళ్ళాం ముందు పరువు పాయె అంటూ.. అతడు సిగ్గుతో వెంటనే ప్యాంట్ వేసుకున్నాడు. ఒత్తిడిలో ఉన్న వ్యక్తుల్ని సైతం నవ్వించే ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓసారి చూసి, హ్యాపీగా నవ్వుకోండి.