Viral News : బకెట్ నీళ్లు కావాలన్నా.. బావిలోకి దిగాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం లేకుండా బావిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఘుసియా గ్రామంలో బావులు, చెరువులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది.
భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలు ఇలాంటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నీటి కోసం భారతీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టే వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్‌లో, మహారాష్ట్రలో నీటి కోసం ఒక మహిళ బావిలో దిగుతున్నట్లు ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఘుసియా గ్రామంలోని ప్రజల నీటి కష్టాలకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. 2019 ప్రపంచ నివేదికలో “నీటి ఒత్తిడి” “అత్యంత ఎక్కువగా” ఉన్న 17 దేశాలలో భారతదేశం ఒకటి.
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
దేశంలోని మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలు సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ప్రతి వేసవిలో నీటి కొరత పునరావృతమయ్యే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం 2024 నాటికి ప్రతి గ్రామానికి కుళాయి నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది.కానీ ఇప్పటికీ లక్షలాది మందికి తాగునీరు అందడం లేదు. ఘుసియాలో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ సంవత్సరం స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.
#WATCH | Madhya Pradesh: People in Dindori's Ghusiya village risk their lives to fetch water from an almost dry well pic.twitter.com/jcuyLmE5xL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 2, 2022
తాజావార్తలు
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..