పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య ప్రస్తుతం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిద్దూ మూస్ వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గేయ రచయితగా కెరీర్ ఆరంభించి లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత జీ వ్యాగన్ అనే పాటతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన డెవిల్ లెజెండ్ జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్జ్ జాట్ దా ముకాబులా బ్రౌన్ బాయ్స్ హత్యార్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ తో మెప్పించిన అతడు ఆ తరువాత సిక్కు మతానికి చెందిన ఆయుధాలు గన్ కల్చర్ గురించి పాటలు రాసి వివాదాలను కొనితెచ్చుకున్నాడు .. ఈ నేపథ్యంలో అతనికి చంపేస్తాం అంటూ ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనను చంపేస్తానని కొందరు అనడంతో సిద్ధూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు భద్రత కల్పించింది. కానీ కొన్ని కారణాల వల్ల సెక్యూరిటీని తొలగించిన మరుసటి రోజే కొందరు దుండగులు సిద్దూ కారుపై కాల్పులు జరిపారు. దాదాపు 20 రౌండ్లు అతడి శరీరంపై కాల్చారు.. ఇక ఈ హత్యలో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్టోయ్ అన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే లారెన్స్ గతంలో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడిన ఒక వీడియో మరోసారి తెరపైకి వచ్చింది.
2018 లో లారెన్స్ ను ఒక కేసులో లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అతడి సహాయకులకు ఢిల్లీ హైకోర్డు రిమాండ్ విధించింది. అప్పుడు మీడియా ముందు లారెన్స్ మాట్లాడుతూ ” ప్రస్తుతం నేను ఏం చేయలేదు. కానీ, నేను ఏమి చేయగలనో, ఏం చేస్తానో అప్పుడే మీకు తెలుస్తుంది. రాజస్థాన్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాను. అప్పుడు నేను ఏంటో మీకు తెలుస్తుంది. మీరేం చేస్తారో అప్పుడు చూస్తా” అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది.. అప్పటినుంచి పోలీసులు ఏ ఈ ముఠాపై నిఘా పెట్టారు. మధ్యలో సల్మాన్ ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఈ ముఠా సభ్యులను అరెస్ట్ కూడా చేశారు. ఇక ఇప్పుడు సింగర్ ను అతి దారుణంగా హత్య చేయడంతో ఆ లారెన్స్ మాటలు ప్రస్తుతం బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.