టైగర్ల గుంపు మధ్య ఓ గ్రామ సింహం దర్జాగా తిరిగేస్తోంది.. ఆ పెద్ద పులులు సరదాగా ఆడుకుంటున్నా.. కొట్లాడుతున్నా.. వాటి మధ్య దర్జాగా తిరుగుతోన్న ఆ శునకాన్ని మాత్రం ఏమీ అనడం లేదు.. సాధారణంగా అయితే, శునకాలను పెద్ద పులులు చంపేసిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ గుంపు మధ్య ఏ మాత్రం జంకు లేకుండా.. తిరుగుతున్నా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గోల్డెన్ రెట్రైవర్ బ్రీడ్‌కు చెందిన ఓ శునకం.. టైగర్స్ గుంపు మధ్య అదురు బెదురు లేకుండా దర్జాగా తిరిగేస్తోంది.. ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నవారిపైకి భౌ.. భౌ అంటూ తెగ అరిచేస్తోంది.. వీడియో తీస్తున్నవారిని పులులు పట్టించుకోకపోయినా.. వాటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ.. ఆ శునకం మాత్రం దర్జాగా తిరుగుతోంది. పులులు మాత్రం ఆ శునకాన్ని ఏమీ అనకుండా వాటి పనిలో అవి ఉన్నాయి.. ఎందుకని ఆరా తీస్తే.. ఆ పులులు.. చిన్న కూనలుగా ఉన్న సమయంలో తల్లికి దూరం అయ్యాయట… అయితే, అప్పటి నుంచి ఆ కుక్క వాటికి పాలిచ్చి పెంచడంతో.. దాంతో, ఆ కుక్కను అవి అమ్మగానే భావిస్తున్నాయట.. సోషల్ మీడియాకు ఎక్కిన ఆ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుండగా.. ఔరా..! శునకానిది ఏమి దర్జా.. అంటూ కొందరు.. సింహాల గుంపునే ఆ శునకం కాపలాగా పెట్టుకుంది అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.