Viral Video: వెంటాడిన దురదృష్టం.. విచిత్రంగా అవుటైన న్యూజిలాండ్ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ షాట్ ఆడగా అది అవతలి ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. చేసేందేమీ లేక న్యూజిలాండ్ ఆటగాడు నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ అవుట్ పట్ల ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ కూడా కాసేపు అయోమయంలోనే ఉండిపోయాడు. హెన్రీ నికోల్స్ ఎలా అవుట్ అయ్యాడో అతనికి కూడా అర్థం కాలేదు. జరిగిందేంటో అర్థం చేసుకోవడానికి ఇంగ్లాండ్ ఫీల్డర్లు, హెన్రీ నికోల్స్, డారిల్ మిఛెల్‌కు కూడా కొంత సమయం పట్టింది.
అయితే క్రికెట్ రూల్స్ ప్రకారం బంతి.. స్టంప్ లేదా అంపైర్ లేదా ఫీల్డర్ లేదా అవతలి ఎండ్ బ్యాటర్‌కు తగిలి ఫీల్డర్ చేతిలో పడితే అవుట్ అయినట్లే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలాంటి అవుట్ ఎక్కడా నమోదు కాలేదు. అయితే గతంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్ దాదాపుగా ఇదే తరహాలో అవుటయ్యాడు. సైమండ్స్ కొట్టిన షాట్‌కు బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మైఖేల్ క్లార్క్ కాలిని తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నాడు. దీంతో సైమండ్స్ చిరునవ్వుతో వెనుదిరిగాడు. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెటర్ హెన్రీ నికొల్స్ కొట్టిన షాట్‌కు బంతి నాన్ స్ట్రైకర్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతిలోకి వెళ్లి పడింది. కాగా ఈ టెస్టులో న్యూజిలాండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ (82), బ్లండెల్ (54) ఉన్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో ఉంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
What on earth!? 😅🙈
Scorecard/clips: https://t.co/AIVHwaRwQv
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/yb41LrnDr9
— England Cricket (@englandcricket) June 23, 2022
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!