Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్ పోలీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ పోలీసు విధులు అనుకున్నంత సులువు కాదన్నది జగమెరిగిన సత్యం. ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఎండనక, వాననక విధులు నిర్వర్తిచాల్సి ఉంటుంది. కానీ, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి ముందుకు వెళుతుంటారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిచడమే కాకుండా.. రోడ్డుపై అవస్థలు పడుతున్న వారికి సహాయం చేసిన ఘటనలు వైరల్ అయ్యాయి. అయితే.. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్న వైరల్ క్లిప్‌లో.. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు చీపురుతో రోడ్డుపై ఉన్న చిన్న గులకరాళ్లు, రాళ్లను ఊడుస్తున్న ట్రాఫిక్ పోలీసు కనిపించాడు. రోడ్డుపై వెళ్లే వారికి లేదా వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఇలా చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. “మానవత్వం ఒక విధి కంటే ఎక్కువ, మళ్ళీ నిరూపించబడింది” అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరికొందరు ఆ పోలీసును అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
Respect for You.🙏 pic.twitter.com/Bb5uZktpZk
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 16, 2022
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2010 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..