Fastag Scam: స్మార్ట్ వాచీతో ఫాస్టాగ్ స్కామ్.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌పీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ పరికరం ఉంది. అయితే తను అద్దాలు తుడుస్తున్న సమయంలో ఆ స్మార్ట్ వాచ్ ద్వారా ఫాస్టాగ్ స్టిక్కర్ ని స్కాన్ చేస్తున్నట్లు గమనించిన యజమాని అతన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. కుర్రాడు పారిపోతాడు. అయితే దీనిపై సదరు కార్ ఓనర్ ఫాస్టాగ్ స్కామ్ జరుగుతున్నట్లు చెప్పడం వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.
వైరల్ వీడియోపై ఎన్‌పీసీఐ క్లారిటీ:
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ఇంటర్నెట్ లో తెగవైరల్ అవుతున్న వీడియోపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ గా తేల్చింది. ఎన్ఈటీసీ ఫాస్టాగ్ ఎకో సిస్టమ్ అనేది ఎన్ పీసీఐ, అక్వైరర్ బ్యాంక్, ఇష్యూ బ్యాంక్, టోల్ ప్లాజా ఈ నాలుగింటి మధ్య లావాదేవీల కోసమే నిర్మించారని.. లావాదేవీలకు ఎండ్ టూ ఎండ్ భద్రతా ప్రోటోకాల్ ఉందని తెలిపింది. ఫాస్టాగ్ పర్సన్ టూ మర్చంట్ లావాదేవీల కోసమే పని చేస్తుందని వెల్లడించింది. ఫాస్టాగ్ నెట్ వర్క్ ద్వారా పర్సన్ టూ పర్సన్ లావాదేవీలు వీలు కావని క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తి ఫాస్టాగ్ లో ఉన్న డబ్బులను పొందలేరని దీంతో స్కాంకు ఆస్కారం లేదని వెల్లడించింది. వినియోగదారుడు టోల్ ప్లాజాల్లోనే చెల్లింపులు చేసేలా మాత్రమే ఫాస్టాగ్ ఉపయోగపడుతుందని తెలిపింది.
వినియోగదారుడు, బ్యాంకుల మధ్య లావాదేవీలు అనుమతించిన ఐపీ అడ్రస్, యూఆర్ఎల్ వైట్ లిస్టింగ్ చేయడం ద్వారా సురక్షితంగా ఉంటాయని తెలిపింది. టోల్ ప్లాజా సెంటర్ లో ఇన్ స్టాల్ చేసిన హార్డ్ వేర్, సెక్యురిటీ మాడ్యుల్ క్రిప్టోగ్రాఫికల్ గా భద్రపరచబడుతుందని ఎన్‌పీసీఐ తెలిపింది. ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించబడవని ఎన్‌పీసీఐ క్లారిటీ ఇచ్చింది. దీనిపై పేటీఎం కూడా స్పందించింది. వీడియో చూపించినట్లు డిజిటల్ వాచ్ ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యపడదని.. ఈ వీడియో ఫేక్ అని వివరణ ఇచ్చింది.
A #viral Video claims that devices like watches are being used to swipe the #Fastag on vehicles, leading to fraudulent deduction of money from prepaid wallets.#PIBFactCheck:
▶️ This Video is #FAKE
▶️ Such transactions are not possible
▶️ Each Toll Plaza has a unique code pic.twitter.com/n7p01AXF4A
— PIB Fact Check (@PIBFactCheck) June 25, 2022
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!