అది ఫ్లైఓవర్. కానీ ఆ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు సినీ ఫక్కీలో యాక్షన్ సన్నివేశాల్లో చూపించినట్లు ఒకరి వెంట ఒకరు జర్రుమని జారి కిందపడిపోతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో బైక్‌పై వెళ్లేవాళ్లు జారిపడిపోతూ గాయాలపాలు అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాలను గమనిస్తే ఈ ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కరాచీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఓ లారీ నుంచి ఆయిల్ కారింది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారులు ఒకరి వెంట ఒకరు జారిపడిపోతున్నారు.
అయితే కొందరు కావాలని ఈ ఘటన జరిగింది హైదరాబాద్‌లో అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కొందరు హైదరాబాద్‌లోని షేక్‌పేట ఫ్లైఓవర్ అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇది పాకిస్థాన్‌కు చెందిన వీడియో అని.. తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన వీడియో కాదని అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఇది ఫ్లైఓవర్ కాదని జారుడు బండ అని ఫన్నీ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
🔴 #ALERT #KARACHI: Several motorcycles were involved in an accident due to slippery roads during heavy pre monsoon rain in city, video of Johar Morar bridge. Please take precautions and avoid unnecessary movement during thunderstorm.#PakWeather #karachirain pic.twitter.com/rXauWxdTPi
— PakWeather.com (@Pak_Weather) June 22, 2022