ఎంతటి ఘరానా దొంగలయినా ఎక్కడో చోట ఆధారాలు మరిచిపోతుంటారు.. కొందరు దొంగలయితే ముఖానికి మాస్కులు పెట్టుకుని దొంగతనాలు చేస్తారు.. మరికొందరయితే దొంగతనరం చేస్తున్న టైంలో ఏదో ఒకటి మరిచిపోతుంటారు.. దొంగతనం చేసిన ఇంట్లోనే భోజనాలు చేసి మరీ ఆ తర్వాత దొరికిపోతారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దొంగల స్టయిలే సపరేటు. ఈ దొంగలు ఏ జ్యూయలరీ షాపునో, బాగా డబ్బులున్న వారినో టార్గెట్ చేయలేదు. ఏకంగా ఓ పాఠశాలనే టార్గెట్ చేశారు.

Read Also: Viral Video: హనుమంతుడి వేషధారణలో హుషారుగా డ్యాన్స్.. హఠాత్తుగా కుప్పకూలి..
ఆ స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ తాళాలను పగుల గొట్టి 20 ల్యాప్ టాప్ లు , 5 కెమెరాలు, సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్.వి విద్యాలయంలో చోటుచేసుకుంది. దొంగలు స్కూళ్ళోకి ప్రవేశించి.. పాఠశాల లోని కంప్యూటర్ ల్యాబ్ తాళాలు పగులగొట్టారు. ముగ్గురు దొంగలు లోనికి ప్రవేశించారు, ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ల్యాప్ టాప్ లతో పాటు 5 కెమెరాలు, ఒక సెల్ ఫోన్ చోరీ చేసిన దొంగలు అక్కడినించి జారుకున్నారు.

అయితే ప్లాన్ చేశారు కానీ పాఠశాల లో సి.సి. కెమెరాలు ఉన్న విషయాన్ని వారు మరిచిపోయారు. చోరీ చేసిన తీరు సీ.సీ కెమెరాలో రికార్డు అయిన సీసీ ఫుటేజ్ ల ఆధారంగా క్లూస్ టీo తో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Also: Tamilnadu: వైరల్ వీడియో.. ఓ సారూ.. నువ్వు ఎంతటి రసికుడివో తెలిసెరా..!!