ఈమధ్యకాలంలో చిరుతపులులు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. సందడి చేసేస్తున్నాయి. ఒక్కోసారి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పాములు, కొండచిలువలు ఇళ్ళల్లోకి వచ్చేశాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం కాశీపురం శివారు గ్రామం లక్ష్మీ,పేట గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Also: Vijayawada: వైరల్ వీడియో ఎఫెక్ట్.. విద్యార్థిని కాలితో తన్నిన లెక్చరర్ సస్పెండ్
ఓ ఇంటి ఆవరణ లో ఉన్న బాత్రూంలో ఈ భారీ కింగ్ కోబ్రా కనబడడంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు మూర్తి, వెంకటేశ్ అక్కడికి చేరుకొని కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఫారెస్ట్ అధికారులతో కలిసి కింగ్ కోబ్రాని వంట్లమామిడి సమీపంలో కొండ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా జనంపై దాడికి ప్రయత్నించింది. దీంతో దానిని హతమార్చారు జనం.
Read Also: Work From Home: మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ సర్కారు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి