Bangalore Doctor Running: కారు వదిలి 3 కిలోమీటర్లు పరిగెత్తిన డాక్టర్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ అంటే దేవుడితో సమానం.. వైద్యో నారాయణో హరి అంటారు. కానీ ఆ మాటలు అప్పుడప్పుడు నిజం అవుతుంటాయి. చావుబతుకుల మధ్య వున్న రోగికి వైద్యసేవలతో పునర్జన్మ ఇస్తాడు వైద్యుడు. బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ చేసిన పని వైరల్ అవుతోంది. ఆస్పత్రికి వెళ్ళడానికి ఆయ డాక్టర్ పడిన తాపత్రయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఓ డాక్టర్ 45 నిమిషాల పాటు నిర్విరామంగా పరిగెత్తి హాస్పిటల్ కు చేరుకుని దేవుడు అనిపించుకున్నాడు. సకాలంలో రోగికి ఆపరేషన్ చేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు.
కర్ణాటక బెంగళూరులో వర్షాలు జనానికి నరకం చూపిస్తున్నాయి. గత నెల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్జాపూర్‌లో ఉన్న మణిపాల్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా చేస్తున్న డాక్టర్ గోవింద్ నందకుమార్. ఆగస్టు 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయన ఓ ఆపరేషన్ చేయాల్సి వుంది. ఓ మహిళకు గ్యాల్‌బాడర్ సర్జరీ చేయాలి. ఆపరేషన్ చేసేందుకు ఆయన ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ ఆ డాక్టర్ ఫుల్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు.
Also Read
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
Read Also: Krishnam Raju Final Rites: అశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి
సర్జరీకి లేట్ అవుతుందేమో అన్న కంగారులో ఆ డాక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏం ఆలోచించకుండా డ్రైవర్ కి కారు వదిలిపెట్టి.. మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీశాడు. ఆ డాక్టర్ శరవేగంగా హాస్పిటల్‌కు చేరుకుని సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ పూర్తిచేశాడు. పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నారని, షెడ్యూల్ ప్రకారమే డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆసుపత్రికి పరిగెడుతున్న వీడియోను ఇటీవల తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వృత్తి పట్ల వైద్యుడి నిబద్ధత, ఆయన మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ అవుతోంది. డాక్టర్ అంటే ఇలాగే వుండాలని.. శభాష్ డాక్టర్ సాబ్ అంటున్నారు నెటిజన్లు.
Read Also: YSRCP: పార్టీ పటిష్టతపై హైమాండ్ దృష్టి.. ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!