Teacher Video:పిల్లలు అన్నాకా అల్లరి చేయడం.. టీచర్లు అన్నాకా మందలించడం సాధారణమే. కానీ ఇలా టీచర్లు మందలిస్తారని తెలిస్తే మేము కూడా స్కూల్ కు వెళ్తామని ఈ వీడియో చూసిన వారందరు చెప్పుకొస్తున్నారు. అంతలా ఆ టీచర్ ను విసిగించిన స్టూడెంట్ ఎవరు..? ఆ టీచర్, ఆ స్టూడెంట్ ను ఎలా మందలించింది అనేది తెలుసుకుందాం. అదొక నర్సరీ స్కూల్.. అందులో మొదటి తరగతి గది.. పిల్లలందరూ తెగ అల్లరి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక బుడ్డోడు చేసే అల్లరిని టీచర్ అస్సలు తట్టుకోలేకపోయింది. ఇంకేముంది.. అతడిని దగ్గరకు పిలిచి.. నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్.. నీతో అస్సలు మాట్లాడను అని బుంగమూతి పెట్టింది. ఇక తన ఫెవరేట్ టీచర్ మాట్లాడకపోయేసరికి సదురు బుడ్డోడు బుజ్జగించడం మొదలుపెట్టాడు.
ఇక నేను క్లాస్ లో అల్లరి చేయను.. ప్లీజ్ మాట్లాడండి అంటూ బతిమాలాడాడు. లేదు.. ఇప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నువ్వు ఇదే విధంగా అల్లరి చేస్తున్నావ్ అంటూ టీచర్ ఇంకా అలక బూనిది. ఇక చేయను.. ప్రామిస్ అంటూ.. తన దగ్గర ఉన్న బ్రహ్మస్త్రాన్నీ సంధించాడు అల్లరి పిడుగు. టీచర్ కు ముద్దుల వర్షం కురిసిపిస్తూ సారీ చెప్పాడు. ఇక దీంతో అలక మానిన పంతులమ్మ సైతం ఈ బుగ్గ మీద పెట్టు.. ఆ బుగ్గ మీద పెట్టు అంటూ అతడి మాటలకు మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఎక్కడిది..? ఏంటి..? అనేది తెలియదు. ఇక ఈ వీడియో చూసిన ఇప్పటి యువత మాత్రం.. మాకు ఇలాంటి టీచర్లు ఉండరు.. అని కొందరు. ఇలాంటి టీచర్లు ఉండాలే కానీ ఎంత బుద్దిగా చదువుకొనేవాళ్లం అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ऐसा स्कूल मेरे बचपन में क्यों नहीं था 😏😌 pic.twitter.com/uHkAhq0tNN
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 12, 2022