Viral : సాధారణంగా చిన్నారులు పరీక్షల సమయంలో తమ ఊహాశక్తిని ఉపయోగించి సమాధానాలు రాస్తుంటారు. అయితే ఒక్కోసారి వారి సమాధానాలు నవ్వించడమే కాక, సమాజాన్ని ఆలోచనలో పడేస్తాయి. అలాంటి ఒక సంఘటన చందుర్తి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. చదువులో భాగంగా జరిగిన ఆంగ్ల పరీక్షలో నాలుగో తరగతి విద్యార్థిని ఒకరికి “Write about your mother’s likes and dislikes” అనే ప్రశ్న వచ్చింది. అంటే “మీ అమ్మకు నచ్చినవి, నచ్చని విషయాలు రాయండి” అన్నమాట.
విధ్యార్థిని సూటిగా రాసింది: “My mother dislikes my grandmother and grandfather.” (నా అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరు.)
ఈ సమాధానాన్ని చూసిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ చిన్నారి ఏమి అర్థం చేసుకుని ఇలా రాసిందోనని మొదట ఆలోచించారు. కానీ తర్వాత ఈ సమాధానంలో చిన్నారి ఇన్నోసెన్సు మాత్రమే కాదు, ఓ కుటుంబ బంధానికి లోతైన ప్రతిబింబం ఉన్నదని గుర్తించారు. ఈ సమాధానం పరీక్ష పత్రంలో చూసిన ఉపాధ్యాయులు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. కొందరు నవ్వుతూ స్పందిస్తే, మరికొందరు మాత్రం దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ ప్రధానంగా చర్చించదగిన అంశం ఏమిటంటే, చిన్నారులు ఇంటిలో విన్న విషయాలను ఎలా గ్రహిస్తారు అనేది. తల్లిదండ్రులు, అత్తమామల మధ్య మాటల తేడా, అభిప్రాయ భిన్నతలు పిల్లల మనస్సుల్లో ఎలా నాటుకుపోతాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. పిల్లలు ఇలాంటి విషయాలను అర్థం చేసుకుని, పరీక్షల వంటి సందర్భాల్లో కూడా బాహాటంగా వెల్లడించగలుగుతారు.
ఈ సంఘటన చిన్నదే అయినా, సమాజంలో కుటుంబ సంబంధాల మార్పులను గమనించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొందరు నెటిజన్లు “ఇది నవ్వుల పంట పండించే సమాధానం కావొచ్చు కానీ, మన కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న దూరాన్ని ప్రతిబింబించే ఉదాహరణ కూడా” అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం పిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నామో, వారు ఏ మేరకు మన మాటలను పరిగణనలోకి తీసుకుంటున్నారో తెలియజేస్తున్నాయి. చిన్నారుల అభివృద్ధిలో కుటుంబ వాతావరణం ఎంత ప్రాధాన్యత వహిస్తుందో ఇది మరోసారి రుజువు చేస్తోంది.
Vijayawada: మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం.. పట్టుబడ్డ ఇద్దరు విద్యార్దులు