వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వరం ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇక హీరోయిన్ల విషయంలో ఆయనను ఆపడం ఎవరి వలన కాదు. హీరోయిన్లతో పాటు యాంకర్లను కూడా వదలని వర్మ తనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్లను పొగడ్లతో ఆకాశానికెత్తేసి వారిని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేశాడు. ఈ వరసలో చెప్పుకోవాలంటే అరియనా, అషూ రెడ్డి, దేవి నాగవల్లి లాంటి యాంకర్లను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చింది వర్మనే చెప్పాలి. ఇక…
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ…
సమాజంలో రోజూ వార్తలు చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని వార్తలు విన్నప్పుడు మాత్రం నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వార్త అలాంటిదే. ఒక వ్యక్తికి రాజకీయాలంటే బాగా ఇష్టం.. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో నిలబడాలి అనుకున్నాడు. కానీ, అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కారణంగా అతడికి సీటు రాలేదు. దీంతో ఎలాగైనా ఆ ఎలక్షన్స్ లో నిలబడడానికి ఆ వ్యక్తి ఒక బీభత్సమైన ఐడియా వేశాడు. తాను…
1ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. 2.ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా కలకలం సృష్టిస్తోన్న సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు.. సినీ పరిశ్రమను వేధిస్తోన్న మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం.. తాజాగా,…
కంప్యూటర్ యుగం.. ప్రపంచం మొత్తం డిజిటల్ గా దూసుకుపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలను నమ్మే వారు మాత్రం ఇంకా లగే ఉంటున్నారు. వీరి వలనే దొంగ బాబాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజగా ఒక మహిళ తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకొంది. ముగ్గురు ఆడపిల్లలు.. నాలుగోసారి కూడా ఆడబిడ్డ పుడితే పుట్టింటికి పంపించేస్తానన్న భర్త.. దీంతో ఆమె కాలు నిలవలేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, భయం. ఎక్కడ తన భర్త తనను వదిలేస్తాడో…
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి…
1.నేతలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణ విషయం.. కానీ, కొన్నిసార్లు విమర్శలు చేస్తూ నోరు జారడం వివాదాస్పదంగా మారి.. విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారేకు వచ్చింది.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2.భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు…
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు లగేజీ కూడా తీసుకెళతారు. ఒక్కోసారి చిలుకలు, కోడిపుంజులను కూడా తమతో పాటు తీసికెళతారు ప్రయాణికులు. అయితే లగేజీ ఎక్కువయితే తప్ప వాటికి టికెట్ కొట్టరు కండక్టర్లు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టారు. గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెళుతున్న మహ్మద్ అలీ అనే ఓప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అయితే బస్సు కండక్టర్ ప్రయాణికుడితో పాటు కోడి పుంజుకు…
నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్షన్‌ని మాత్రం మెటావర్స్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం. శివలింగపురం…