ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి రోజుల కోసం చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మరి ఇవాళ కూడా ప్రత్యేకమైన రోజే. ఈ రోజు తేదీ అయితే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు తేదీలో 2 అనే సంఖ్య ఆరు సార్లు కనిపిస్తుంది. 22వ తేదీ, రెండో నెల.. 2022 సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.02.2022ను సూచిస్తుంది.…
డబ్బు.. ప్రపంచాన్ని నడిపిస్తోంది.. కాదు కాదు శాసిస్తోంది. రక్త సంబంధాలు, మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆస్తికోసం కన్నబిడ్డలు కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్నారు. తాజాగా ఇద్దరు కొడుకులు.. ఆస్తి గొడవల్లో కన్నతండ్రిని అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో మరికాళయ్య కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు శశికుమార్, రాజేష్. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఒక…
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటించడంలేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు కొనసాగించాలని సభ్యదేశాలను కోరింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ…
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంతో మంది ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్నా.. చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు మరవలేనివి. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే మళ్లీ చిన్ననాటి స్కూల్ డేస్ లోకి వెళ్లాలని చాలమందే అనుకుంటారు. స్కూల్ గురించి ఎవరైనా మాట్లాడిన మనం అనుకోకుండా మన స్కూల్ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటాం. ఆనాడు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటుంటాం. పాఠశాల విద్యాభ్యాసం, 10 తరగతి పరీక్షల తరువాత అప్పటివరకు కలిసి చదువుకున్న స్నేహితులు ఇకనుంచి మనతో చదువుకోకుండా ఒక్కోరు ఒక్కో…
ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. ఫిబ్రవరి 14 వరకు ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. మళ్ళీ ఢిల్లీ రావడం సంతోషంగా ఉందన్న ఆయన తనకున్న అనుభవం ద్వారా రాష్ట్ర పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తా అన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి యోజన లో భాగంగా తెలంగాణ లో 5…
అసోంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు స్కూటర్ కొనుగోలు చేసేందుకు తాను తాచుకున్న డబ్బంతా బైక్ షోరూంకు బస్తాలో తీసుకెళ్లాడు. అయితే ఆ నగదు అంతా చిల్లర నాణేలు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నెలలు తరబడి చిల్లర నాణేలను పొదుపు చేశాడు. ఇలా ఎనిమిది నెలల పాటు పోగుచేసిన నాణేలను ఒక బస్తాలో వేసి…
సాధారణంగా భర్తలు తప్పు చేస్తే భార్యలు వారిని చీల్చి చెండాడతారు. ఇక వేరే అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడని తెలిస్తే అంతే సంగతులు. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతడిని కొట్టి పోలీసులకు అప్పగించిన భార్యల గురించి చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఒక భార్య తన భర్త వేరే అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఏ భార్య చేయని పని చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వరం ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఇక హీరోయిన్ల విషయంలో ఆయనను ఆపడం ఎవరి వలన కాదు. హీరోయిన్లతో పాటు యాంకర్లను కూడా వదలని వర్మ తనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్లను పొగడ్లతో ఆకాశానికెత్తేసి వారిని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేశాడు. ఈ వరసలో చెప్పుకోవాలంటే అరియనా, అషూ రెడ్డి, దేవి నాగవల్లి లాంటి యాంకర్లను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చింది వర్మనే చెప్పాలి. ఇక…
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగా ఆదివారం దిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఏపీ హైకోర్టులో ఉదయం 10:30 గం.లకు ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. న్యాయమూర్తులచేత ప్రమాణం చేయించనున్నారు సీజే జస్టిస్ పీకే మిశ్రా. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ…