Short News: ఎన్టీవీ షార్ట్ న్యూస్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటించడంలేదు. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు కొనసాగించాలని సభ్యదేశాలను కోరింది.
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. EC ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు.
- మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు సరఫరా చేస్తున్న పేలుడు పదార్థలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తుల నుండి 10 కార్డెక్స్ వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరిని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
- హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో సినీ ఇండస్ట్రీ ప్రతినిధుల కీలక సమావేశం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో జి.ఆదిశేషగిరిరావు అధ్యక్షతన భేటీ అయ్యారు. 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. ఎస్ ఎస్ రాజమౌళి. మైత్రి నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి, ఛత్రపతి ప్రసాద్, అనిల్ సుంకర, ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. గంటన్నరపాటు సమావేశం కొనసాగింది.
- ఏపీ పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందన్నారు టీడీపీ నేత నారా లోకేష్. తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి కొమ్ముకాస్తూనే వున్నారు ఖాకీలు. ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు-ప్రతిపక్ష టిడిపి పై దాడులకీ తెగబడ్డారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులూ చివరికి వైసీపీ బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..