కంప్యూటర్ యుగం.. ప్రపంచం మొత్తం డిజిటల్ గా దూసుకుపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలను నమ్మే వారు మాత్రం ఇంకా లగే ఉంటున్నారు. వీరి వలనే దొంగ బాబాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజగా ఒక మహిళ తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకొంది. ముగ్గురు ఆడపిల్లలు.. నాలుగోసారి కూడా ఆడబిడ్డ పుడితే పుట్టింటికి పంపించేస్తానన్న భర్త.. దీంతో ఆమె కాలు నిలవలేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, భయం. ఎక్కడ తన భర్త తనను వదిలేస్తాడో…
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి…
1.నేతలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణ విషయం.. కానీ, కొన్నిసార్లు విమర్శలు చేస్తూ నోరు జారడం వివాదాస్పదంగా మారి.. విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారేకు వచ్చింది.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2.భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు…
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు లగేజీ కూడా తీసుకెళతారు. ఒక్కోసారి చిలుకలు, కోడిపుంజులను కూడా తమతో పాటు తీసికెళతారు ప్రయాణికులు. అయితే లగేజీ ఎక్కువయితే తప్ప వాటికి టికెట్ కొట్టరు కండక్టర్లు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టారు. గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెళుతున్న మహ్మద్ అలీ అనే ఓప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అయితే బస్సు కండక్టర్ ప్రయాణికుడితో పాటు కోడి పుంజుకు…
నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్షన్‌ని మాత్రం మెటావర్స్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం. శివలింగపురం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,సినీనటుడు విష్ణు విశాల్ దంపతులు. ఈ సందర్భంగా విష్ణు విశాల్,గుత్తా జ్వాల మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే…
కొందరికి మొబైల్ చేతిలో ఉంటే చాలు… వేరే లోకం అవసరం లేదు. మొబైల్ చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలకు గురయ్యేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ చూడటంలో పూర్తిగా బిజీ అయిన ఒక వ్యక్తి మెట్రో రైల్ పట్టాలపై పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… ఈశాన్య ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల శైలేందర్ మెహతా శుక్రవారం మరో చోటకు వెళ్లేందుకు షాహదారా మెట్రో స్టేషన్కు…
విశాఖపట్నంలో పప్పుల చిట్టీ స్కామ్ లో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సబ్బేళ్ల రామారెడ్డిని అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీసులు విచారిస్తున్నారు. సంక్రాంతికి వంట సరుకుల పేరుతో చిట్టీల వ్యాపారం చేసిన ఎలియాబాబు అలియాస్ రవి.. చోడవరం,నర్సీపట్నం ఏరియాల్లో ఏడు వేల మందికి పైగా ఖాతాదారుల వద్ద నుండి సుమారు ఐదు కోట్లు వసూళ్లకు పాల్పడ్డాడు. ఎలియాబాబు, రామారెడ్డి నిందితులుగా తేల్చిన పోలీసులు…ఇప్పటికే ఎలియాబాబు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో హార్స్…
అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బదులిచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. ఛలో విజయవాడకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. విజయవాడ పోలీసుల నిఘా నేత్రంలో వుంది.…
1.కేంద్ర బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని, మెట్రో రైలు కు నిధులు అడిగాం ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరినా పట్టించుకోలేదన్నారు. మిషన్ భగీరథ కు ఫండ్స్ అడిగినా ఇవ్వకపోవడం దారుణం అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారు. ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని కేటీఆర్ ప్రశ్నించారు. 2.కేంద్ర బడ్జెట్ దేశానికి మేలుచేసేలా లేదన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రైతులకు…