సాధారణంగా భర్తలు తప్పు చేస్తే భార్యలు వారిని చీల్చి చెండాడతారు. ఇక వేరే అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడని తెలిస్తే అంతే సంగతులు. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతడిని కొట్టి పోలీసులకు అప్పగించిన భార్యల గురించి చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఒక భార్య తన భర్త వేరే అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఏ భార్య చేయని పని చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ కి చెందిన దశరథ్ అనే వ్యక్తి రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2018లో అతడికి కరోండ్ ప్రాంతానికి బదిలీ అయింది. అక్కడ తనకు పెళ్లి కాలేదని చెప్పి ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్ మొదలుపెట్టాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే కొద్దిరోజులకు ఆ యువతికి అస్సలు నిజం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు పెళ్లి కాలేదని అబద్దం చెప్పి, తనను లోబరుచుకున్నాడని తెలుపుతూ అతడిపై అత్యాచార కేసు పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న భారీ, భర్తను ఒక్క మాట అనకుండా ఆ యువతితో భర్తకు వివాహం జరిపించింది. అయితే భర్త ఉద్యోగం కాపాడుకోవాడనికి ఈ విధంగా చేసిన భార్య.. వారిద్దరితో కలిసి నివసిస్తోంది. అయితే కొన్ని రోజులు బాగానే ఉన్న భర్త , రెండో భార్యను, మొదటి భార్య సహాయంతో వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని బెదిరించారు. దీంతో చేసేదిలేక మరోసారి యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.