Vinesh Phogat Fires on PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చీఫ్ పీటీ ఉషపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 సమయంలో పీటీ ఉష కేవలం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని విమర్శించారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, ఫొటో షో కోసమే ఆమె వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం…
Haryana Assembly Elections:దేశపు స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వినేష్ ఫోగట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ రోజు నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించింది.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్‌పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పుల చెరిగారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను వెల్లడించాయి. దీంతో ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోతుంది. మంగళవారం బీజేపీ 21 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో రాజకీయ ప్రత్యర్థులపై క్లారిటీ వస్తోంది.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరింది. హస్తం పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఆమెకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించింది. జులానా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ తప్పుపట్టారు. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు్న్నట్లు తెలిపారు
Indian Railways : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల రాజీనామాలను భారతీయ రైల్వే సోమవారం ఆమోదించింది. శుక్రవారం కాంగ్రెస్‌లో చేరడానికి ముందు, ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
Brij Bhushan: రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వీరి చేరిక తమ పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అదినాయకత్వం భావిస్తోంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరింది. వినేష్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండగా, బజరంగ్ పునియా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.