CAS React on Vinesh Phogat Appeal: తమ బరువును పరిమితి లోపు ఉంచుకునే బాధ్యత అథ్లెట్లదే అని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపు ఉండదని ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) స్పష్టం చేసింది. ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. వినేశ్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకున్నా.. అనర్హత వేటు కారణంగా అందరూ…
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన వినేశ్‌కు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి స్వగ్రామం హరియాణాలోని బలాలికి 13 గంటల పాటు ప్రయాణించి చేరుకున్నారు. బలాలి గ్రామస్థులు ఆమెకు భారీగా లడ్డూలను బహుమతిగా అందజేశారు. అంతేకాదు రూ.21 వేలను కూడా గిప్ట్‌గా ఇచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానికులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. Also Read: Gold Price Today: పండగ వేళ…
Balali Villagers Gives 21 Thousand to Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వదేశంకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయంలో భారీఎత్తున అభిమానులు ఆమెకు వెల్‌కమ్ చెప్పారు. భారత రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్‌లు వినేశ్‌ను స్వాగతించిన అనంతరం తనతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన వినేశ్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన స్వగ్రామం హరియాణాలోని బలాలిలో కూడా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి…
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వినేష్ ఢిల్లీకి తిరిగి రావడానికి ముందే, భారత రెజ్లర్ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్‌లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది.
పారిస్ గేమ్స్‌లో వినేష్ ఫోగట్‌కు కోచ్‌గా ఉన్న వూలర్ అకోస్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఒలింపిక్ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు.. వినేష్ దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ రకాల కసరత్తులు చేసినట్లు కోచ్ వూలర్ అకోస్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపాడు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని భయపడ్డామన్నాడు. తొలి ఒలింపిక్స్‌ను సాధించడానికి వినేష్ తన జీవితాన్ని లెక్క చేయలేదని కోచ్ తన పోస్ట్‌లో చెప్పాడు.
Vinesh Phogat: ఒలింపిక్ పతకం సాధించాలన్న వినేష్ ఫోగట్ కల చెదిరిపోయింది. ఆమెకి కంబైన్డ్ రజత పతకాన్ని ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తిరస్కరించింది. దింతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఇప్పుడు మరికొన్ని దారులను అన్వేషిస్తోంది. అయితే సీఏఎస్ నిర్ణయం ఈ వ్యవహారానికి ఒక విధంగా ముగింపు పలికింది. ఈ కేసు మొత్తం దేశానికి, రెజ్లింగ్ ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. Gold Rate Today: పండగ వేళ పెరిగిన పసిడి..…
Vinesh Phogat Weight Gain Reasons: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వంద గ్రాముల అధిక బరువు ఉండటంతో వినేశ్ వేటుకు గురైంది. సెమీ ఫైనల్ తర్వాత 49.9 కేజీలు మాత్రమే ఉన్న వినేశ్.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కేజీలకు పెరిగింది. ఫైనల్‌కు ముందు తీవ్రంగా శ్రమించినా.. 100 గ్రాములను మాత్రం…
వినేశ్ ఫోగట్‌కు భారీ షాక్ తగిలింది. రజత పతకం కోసం చేసిన ఆమె అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని CAS నిర్ణయించింది. కాగా.. రజత పతకం వస్తుందని ఆశించిన వినేశ్ తో పాటు.. భారతవనికి నిరాశ ఎదురైంది.
రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. వినేష్‌కి కచ్చితంగా అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను.. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో…