Vinesh Phogat: పీటీ ఉష ఫొటో కోసమే వచ్చారు.. అదో పెద్ద రాజకీయం: వినేశ్ ఫొగాట్
- ఉష ఫొటో కోసమే వచ్చారు
- మెడల్‌ను ఎప్పుడో వదిలేసేశారు
- వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat Fires on PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చీఫ్ పీటీ ఉషపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 సమయంలో పీటీ ఉష కేవలం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని విమర్శించారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, ఫొటో షో కోసమే ఆమె వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం కారణంగానే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో తీర్పు అనుకూలంగా రాలేదని వినేశ్ పేర్కొన్నారు.
2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్.. త్రుటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌ను తగ్గించుకొనేందుకు వినేశ్ బాగా కష్టపడ్డారు. ట్రెడ్‌మిల్, సౌనా బాత్, జిమ్, ఇతర వ్యాయామాలు చేశారు. ఈ సమయంలో ఆమె ఒక్క చుక్క నీరు కూడా తీసుకోలేదు. దాంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురై.. ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న వినేశ్‌ను కలవడానికి ఐవోఏ చీఫ్ పీటీ ఉష వెళ్లారు. ఆ సమయంలో ఫోగట్‌తో ఉష ఫోటో కూడా దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినేశ్ మాట్లాడుతూ.. ఉషపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Also Read: IND vs BAN: పాపం సర్ఫరాజ్.. ఎప్పటివరకు ఆగాలో?! అసలే లేటు ఎంట్రీ
‘పీటీ ఉష మేడమ్ నా దగ్గరకు వచ్చి ఫొటో దిగారు. నా ఆరోగ్యం గురించి ఆమె ఏమీ అడగలేదు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా కేవలం షో కోసమే. అదో పెద్ద రాజకీయం. ఫైనల్ అనర్హతపై కాస్‌లో నా పేరు మీదే కేసును ఫైల్ చేశా. వాస్తవానికి దేశం పేరుతో చేయాలి. కానీ ప్రభుత్వం, ఐవోఏ నుంచి మద్దతే లేదు. వారు మెడల్‌ను ఎప్పుడో వదిలేసేశారు. హారీశ్ సాల్వే కేసు వాదించేందుకు ముందుకు వచ్చారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మద్దతు దక్కాలి. కానీ వారంతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యారు. థర్డ్ పార్టీగానే కాస్‌లో మేం వాదనలు వినిపించాం. దురదృష్టవశాత్తు అనుకూల ఫలితం రాలేదు’ అని వినేశ్ ఫొగాట్ తెలిపారు. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన వినేశ్.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. హర్యానాలోని జులనా స్థానం నుంచి ఆమె పోటీకి సిద్దమయ్యారు.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!