Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీరి చేరిక కాంగ్రెస్‌కి మరింత జోష్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌లో చేరికపై వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం మనకు అనుకూలంగా లేని సమయంలోనే ప్రజలకు ఎవరు అండగా ఉంటారో తెలుస్తుందని అన్నారు.
Brij Bhushan Sharan Singh: రెజ్లింగ్ బాడీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారత ఏస్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి వారు ఆందోళనలు చేశారు.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.
Vinesh Phogat To Joins Congress Today: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో ఓ మధుర జ్ఞాపకం అని, తాను మంచి సమయం గడిపానని చెప్పారు. దేశ సేవ కోసం తనకు ఇచ్చిన ఈ అవకాశంకు రైల్వేకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రైల్వే ఉన్నతాధికారులకు వినేశ్ తన రాజీనామా లేఖను…
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే వారు హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది.
Vinesh Phogat Likely To Join Congress Ahead of Haryana Assembly Elections: భారత స్టార్ రెజ్లర్‌లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాశ్మీర్‌కు వెళ్లే ముందు రెజ్లర్లలతో రాహుల్ సమావేశమయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లు వినేశ్, బజ్‌రంగ్‌లు…
పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు దగ్గర అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. కర్షకుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వినేష్ ఫోగట్‌ను పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీ కుమార్తె.. మీకు అండగా ఉంటుందని ప్రకటించారు.
Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు.
Vinesh Phogat Birthday: నేడు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బలాలి గ్రామ పెద్దలు (సర్వ్ ఖాప్) ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ సహా మరికొందరు పాల్గొన్నారు. వినేశ్‌ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే సర్వ్ ఖాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే నేడు వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. నేటితో ఆమె 30వ…