మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు హర్యానా రాష్ట్ర క్రీడా విభాగం బహుమానం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండడంతో మూడు ఆప్షన్లు ఇచ్చింది. నగదు మరియు నివాసం లేదా గ్రూప్ ఏ ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చింది.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ కనిపించడం లేదంటూ హర్యానాలోని జులానా నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ.. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్‌లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వినేష్ ఫోగట్ 6015 ఓట్లతో గెలుపొందారు. వినేష్‌కి మొత్తం 65080 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యోగేష్ కుమార్‌కు 59065 ఓట్లు వచ్చాయి. తన విజయంపై వినేష్ ఫోగట్ మొదటిసారి స్పందించింది.
Haryana Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీకి చెందిన మాజీ ఆర్మీ కెప్టెన్ యోగేష్ బైరాగి రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వినేష్ ఫొగట్…
Vinesh Phogat Julana Election Results: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. దాంతో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. బీజేపీ క్రమంగా పుంజుకుంది. ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. దాంతో హర్యానా పీఠంను వరించేది ఎవరిదనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా…
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హతకు గురైనప్పుడు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బుధవారం నోటీసు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా క్రీడల నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించేసింది.
కాంగ్రెస్ నేత, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్పై లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని వినేష్ ఫోగట్‌కు సూచించారు. అనర్హతకు గురైనందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ప్రస్తుతం రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆమె కజిన్ సిస్టర్ బబిత ఫోగట్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే వినేష్.. కాంగ్రెస్లో చేరడాన్ని బబిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.