దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాలతో పాటు పల్లెల్లో వరద ప్రళయం కొనసాగుతుంది. మరోవైపు భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి. మరోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఫ్ బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి ఇప్పటికి 12 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మరో 75 మందిని సురక్షితంగా బయటకు తీశామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Sammohanuda: ఏయ్.. ఏయ్.. కిరణ్ అన్నా.. రాధికతో రొమాన్స్.. ఈ రేంజ్ లోనా
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్పారు.
Harish Rao : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వైద్య శాఖను అప్రమత్తం చేసిన మంత్రి
మరోవైపు ప్రమాదస్థలికి ఆదిత్య ఠాక్రే వెళ్లారు. అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. మేము గ్రామస్థులతో మాట్లాడటానికి ప్రయత్నించాము, కానీ అక్కడికి చేరుకోవడం కష్టంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేము ఖచ్చితమైన ప్రదేశానికి వెళ్లాలని పట్టుబట్టడం ద్వారా రాష్ట్ర యంత్రాంగంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుకోలేదన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని కూడా అన్నారు. నేను సమస్యను రాజకీయం చేయదలచుకోలేదు. మేము తరువాత ప్రశ్నలను లేవనెత్తుతాము. అయితే మేము ముందుగా ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉన్నందున మేము ప్రస్తుతానికి రెస్క్యూ కార్యకలాపాలపై దృష్టి పెడతాము అని ఆదిత్య ఠాక్రే అన్నారు.
Ap Govt : వాలంటీర్ జీతాల పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం..
ఈ ప్రమాదంలో చనిపోయినవ వారికి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందినప్పటి నుంచి స్థానిక ధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని.. మరో రెండు బృందాలు త్వరలో చేరుకుంటాయని చెప్పారు. భారీ వర్షాలు, చీకటి కారణంగా మొదట్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని, అయితే ఇప్పుడు వేగం పుంజుకుందని ఆయన అన్నారు.
रायगड जिल्ह्यातील खालापूर तालुक्यातील इर्शाळगड पायथ्याशी असलेल्या वस्तीवर मध्यरात्री दरड कोसळल्याने काही जणांना आपला प्राण गमवावा लागला. तर अनेकजण या ढिगाऱ्याखाली अडकले आहेत. या घटनेची माहिती मिळताच मुख्यमंत्री मा. ना.श्री.@mieknathshinde साहेब पहाटेपासून घटनास्थळी उपस्थित आहेत.… pic.twitter.com/c3HvwQHYw8
— Dr Shrikant Lata Eknath Shinde (@DrSEShinde) July 20, 2023