మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది.. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇక, ఎవ్వరితో పనిలేదు అనేలా పరిస్థితి తయారైంది.. చిన్న, పెద్ద తేడాలేకుండా.. స్మార్ట్‌ఫోన్ లేకుంటే క్షణం కూడా ఉండలేకపోతున్నారు.. ఈ తరుణంలో ఓ గ్రామ పంచాయతీ చేసిన ఏకగ్రీవ తీర్మానం వైరల్‌గా మారిపోయింది.. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బన్నీ గ్రామంలో.. 18 ఏళ్ల లోపు చిన్నారులు, యువత మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు.. దీనిపై గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Read Also: Sajjala Ramakrishna: ఎవరైనా చంద్రబాబు భార్యని అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి?
మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలోని బన్సీ అనే గ్రామం ఉంది.. పిల్లలు మరియు యుక్తవయస్కులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడాన్ని గమనించారు పెద్దలు.. పిల్లలు ఆటలు ఆడడం మానేశారు.. ఫోన్లలోనే గేమ్స్ చూడడమే పనిగాపెట్టుకున్నారు.. వెబ్‌సైట్‌లను సెర్చ్ చేస్తున్నారు.. వీడియో గేమ్స్ ఆడుతున్నారు.. అడ్డమైన వీడియోలు చూస్తున్నారు.. మొత్తంగా చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారని.. బన్సి గ్రామ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్తా పెద్దల దృష్టికి వెళ్లింది.. ఇంకేముంది.. 18 ఏళ్ల లోపువారు మొబైల్ ఫోన్ల వాడడంపై నిషేధం విధించారు.. దీనిపై బన్సీ గ్రామపంచాయతీ సర్పంచ్ గజానన్ టేల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను నిషేధాన్ని ఖచ్చితంగా పాటించేలా చేయాలని కోరారు.
సర్పంచ్ టేల్ చెబుతున్న ప్రకారం.. గ్రామంలోని పాఠశాల పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారారని, దానికి ప్రతిస్పందనగా, 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్‌లను నిషేధించాలని అధికారిక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందని స్పష్టం చేశారు.. అయితే, అమలు చేయడంలో ఇబ్బందులు ఉంటాయని మాకు తెలుసు. కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలను తొలగిస్తాం. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు.. ఇదే సమయంలో గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించారని వెల్లడించారు.. మొదట్లో వారికి కౌన్సెలింగ్ చేస్తాం.. మా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే మాత్రం జరిమానా విధిస్తామని తెలిపారు.. అయితే, జరిమానా ఎంత విధించాలి అనేదానిపై ఇంకా ఖచ్చితమైన నిర్ణయం మాత్రం తీసుకోలేదని పేర్కొన్నారు సర్పంచ్ టేల్.