ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…
తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే.. థియేటర్లను పూలతో లకరించడం దగ్గర నుంచి కటౌట్స్, ప్లెక్సీలు, పాలాభిషేకాలు, పూలు, దండాలు.. అబ్బో మామూలు హడావిడి ఉండదు. ఇక మొదటి రోజు మొదటి షోలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. డాన్స్ లు, ఈలలు, గోలలు, పేపర్లు బట్టలు చించేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు.కొన్ని థియేటర్లలో అభిమానుల రచ్చకు థియేటర్ల తెరలు చిరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి . ఇక ఇవన్నీ థియేటర్ల…
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు…
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల (New Districts) నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కలెక్టర్లు.. ఎస్పీలతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రేపో, ఎల్లుండో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షంచనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల…
సినిమా థియేటర్లకు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిపోయింది… కొత్తి సినిమా విడుదలైన సందర్భంగా తమకు ప్రతీ షోకి వంద టికెట్లు ఇవ్వాలని లేఖలో థియేటర్ల యాజమాన్యాలను కోరారు మేయర్… కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో ఒక రకంగా తమకు ఎదురైయ్యే ఇబ్బందులను కూడా లేఖలో పేర్కొన్నారామె.. ప్రతీ నెల కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయని.. అయితే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో టికెట్లు కావాలని పార్టీ ప్రతినిధులు,…
మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఆధునిక ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న మహిళలే. మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయి. మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా C-17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం వుంది.…
విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. దీంతో శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్నారు వంగవీటి రంగా, రాధా అభిమానులు. భారీ ర్యాలీతో, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు అభిమానులు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నా తండ్రిని కులమతాలకతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు.రాష్ట్రం నలుమూలలా రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.…
విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్…