ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం నడుస్తోంది. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలనూ రాజకీయ లబ్ధికి వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరం.నిందితుడు వినోద్ జైనును పార్టీ నుంచి సస్పెండ్ చేశాం.
ఆడబిడ్డలకు అండగా నిలబడటం చేతకాని వైసీపీ నేతలు మాపై విమర్శలా?సీఎం జగన్ చేతకాని తనం మహిళల పాలిట శాపంగా మారింది.కాలకేయుల మాదిరి వైసీపీ నేతలు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.రెండున్నరేళ్లలో ఒక్క కిరాతకుడి పైనా చర్యల్లేవు.ఇంటి నుంచి బయటకు రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి. నేరస్థులకు అండగా నిలుస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారన్నారు.