చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం అయింది. మ్యానిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్ పల్లంరాజు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో తులసిరెడ్డి, జంగా గౌతం, తాంతియాకుమారి, మస్తాన్ వలి, రమాదేవి, ఉషానాయుడు తదితర నాయకులు ఉన్నారు.
విజయవాడ నగరంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జై భారత్ పార్టీల రాష్ట్ర స్ధాయి పొలిటికల్ సెమినార్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు.