TDP-Janasena: 28న టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: విజయవాడలో జరిగిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ – జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.. ఇక, తాడేపల్లి గూడెం సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.. తాడేపల్లి గూడెం సభ వేదికగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం లభించింది.. పొత్తును స్వాగతించిన టీడీపీ – జనసేన కేడర్ ను అభినందిస్తూ తీర్మానం. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసింది.
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ ఉంటుందన్నారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది.. త్వరలో విడుదల చేస్తాం అని వెల్లడించారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలి. టీడీపీ – జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతారు.. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నాం. టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు – పవన్ సూచిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు. బై బై వైసీపీ అనేది ఓ నినాదంగా మారాలి. రెండు నెలల్లో వైసీపీ నుంచి విముక్తి లభించాలన్నారు. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తాం. అభ్యర్థుల విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!