కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా? అని సవాల్ చేశారు.. ఎవరి గురించి మాట్లాడాడో చెప్పకుండా... ఒక ఎంపీ అని గాలివార్త చెప్తే సరిపోదు కదా..? అని నిలదీశారు..
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్ధులు మాల్ ప్రాక్టీసులో పట్టుబడటం కలకలం రేపుతోంది.. సిద్దార్ధ వైద్య కళాశాలల్లో బుధవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు పెట్టారన్న సమాచారం రావటంతో ఎన్టీఆర్ యునివర్సిటీ అధికారులు తనిఖీలు చేశారు..
ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు విజయవాడలో జరుగుతోంది.. వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలని అన్నారు.. అలాగే కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం అన్నారు.. ఏ మునిసిపాలిటీ కలెక్షన్ ఆ మునిసిపాలిటీలోనే వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు.. వచ్చే మార్చి నాటికి 80 శాతానికి పైగా కలెక్షన్లు జరిగిపోవాలన్నారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..
బెజవాడలో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. అక్రమ సంబంధానికి పాప అడ్డం వస్తుందని వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన శ్రీ రాములు అనే వ్యక్తి. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైఎస్సార్ కాలనీ కి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మొదటి భర్త ఆటో డ్రైవర్. కాగా ఏవో కారణాలతో విడిపోయి…
నగల తయారీ, వినూత్న డిజైన్లతో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్ ‘ముకుంద జ్యువెల్లర్స్’ తన బ్రాండ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. సాంప్రదాయ భారతీయ డిజైన్‌ల నుంచి.. ఆధునిక, సమకాలీన శైలుల వరకు అనేక రకాల ఆభరణాలను ముకుంద జ్యువెలర్స్ అందిస్తోంది. ఆకర్షణీయమైన ఆభరణాల ఎంపికతో పాటు గ్లామర్ జెమ్స్ కస్టమ్ డిజైన్ సేవలను కూడా అందిస్తోంది. ఇప్పటికే కూకట్‌పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ, సుచిత్ర, హనుమకొండ, ఖమ్మంలలో బ్రాంచ్‌లను కలిగి ఉంది. అయితే తాజాగా ముకుంద జ్యువెల్లర్స్ ఓ బంపరాఫర్ ప్రకటించింది.…
Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కుమార్తె పై కన్నతల్లి కేసు పెట్టేందుకు సిద్ధమవటం దానికి పోలీసులు సహకరించి వేధింపులకు దిగడంతో మౌనిక అనే యువతి విజయవాడలో సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రావడమే కాకుండా, అక్కడి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది.
విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నాను. ఎపీఎంసీ సభ్యులుగా డాక్టర్ గోగినేని సుజాత, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు, డాక్టర్ డి.శ్రీహరిబాబు, డాక్టర్ స్వర్ణగీత, ఎస్.కేశవరావు బాబు, డాక్టర్ సి.మల్లీశ్వరి ప్రమాణస్వీకారం చేయగా వారికి అభినందనలు తెలిపారు..
అనుమానస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందటానికి ముందు బెజవాడలో ఉన్న 3 గంటలు ఏం చేశారనే దానిపై మిస్టరీ వీడింది. ఈ నెల 24న ప్రవీణ్ బెజవాడ మీదుగా రాజమండ్రి వెళ్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో బెజవాడ నగరంలో ఉన్న 200 సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు ప్రవీణ్.. విజయవాడ నగరంలో ఏం చేశాడనే విషయాన్ని గుర్తించి నివేదికను పోలీస్ కమిషనర్ (సీపీ)కి అందజేశారు పోలీసులు..