Toll Charges: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి ( మార్చ్ 31) నుంచి అమలులోకి రాబోతున్నాయి.
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసాధ్యాలే అని ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.
ప్రియురాలి హత్యకు ఓ న్యాయవాది ప్రయత్నించిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది.. న్యాయవాది అన్వర్ తన కారుతో బీభత్సం సృష్టించాడు.. తన ప్రియురాలు నసీమాపై హత్యాయత్నం చేశాడు.. ఆమె ప్రయాణిస్తున్న కారును తన కారుతో ఢీకొట్టిన అన్వర్.. కారుతో గుద్ది చంపేయాలని ప్రయత్నించాడు.. ఇక, ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న మరిన్ని వాహనాలను కూడా ఢీ కొట్టి వెళ్లిపోయాడు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు..
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సత్యవర్ధన్.. దీంతో, ఈ…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపడతామని పేర్కొంది.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది కోర్టు
శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా విచారించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..