Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వల్లభనేని వంశీతో సహా ఐదుగురు నిందితులకు రిమాండ్ ఈ నెల 22 వరకు పొడిగించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు.. ఇదే కేసులో వంశీ ప్రధాన అనుచరుడు రంగాపై పీటీ వారెంట్ దాఖలు చేయగా.. అనుమతి ఇచ్చింది కోర్టు.. రంగాకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో.. ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ తరలించిన విషయం విదితమే కాగా.. ఈ అరెస్ట్ తర్వాత.. వంశీపై మరికొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి..
Read Also: KTR: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్..