శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో.. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది దేవస్థానం.. ఘాట్ రోడ్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నట్టు స్పష్టం చేసింది దేవస్థానం.. మరమ్మత్తులు, కొండచరియలు, మెష్ తదితర పనుల నిమిత్తం మే 06, 07, 08 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయనున్నారు..
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం 5 గంటలకే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాగా.. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండబోతున్నాయి..
బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి రాజుకున్న వివాదం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది? రెండు సార్లు ఎంపీగా గెలిచిన అన్న నానిని గత ఎన్నికల్లో మొదటి ప్రయత్నంలోనే ఓడించి రికార్డు మెజార్టీతో పాగా వేశారు తమ్ముడు కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య వివాదం 2024 ఎన్నికలకు ముందు బయట పడింది. నాని ఎంపీగా ఉన్నప్పుడే... టీడీపీలో యాక్టివ్ అయిపోయి ఆయనకు పక్కలో బల్లెంగా మారారట చిన్ని. చివరికి…
Kesineni Chinni vs Kesineni Nani: విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. మాజీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ ఎంపీ చిన్ని లీగల్ నోటీసు పంపించారు. రూ. 100 కోట్లు నష్ట పరిహారం కోరుతూ ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. కాగా, కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని ఓ పోస్ట్ పెట్టారు.
బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది.
విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాల్ ప్రాక్టీసులో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యం ఉన్నట్టు నిర్ధారణ విచారణలో తేలింది. 12 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక తేల్చింది. కళాశాల సూపరెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజలేటర్లు, ఇద్దరు క్లర్క్ లపై చర్యలకు సిఫార్సు చేసింది. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు…
కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్, నేను, ప్రశాంత్ కిషోర్ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..
ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ కూటమిలోని మరో ఎమ్మెల్యే గళం ఎత్తారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ తో ఏకీభవించారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు... ఉదయంపూట విజయవాడకు విమాన కనెక్టివిటీ లేదన్న ఆయన.. విజయవాడలో పార్టీ మీటింగ్ లు, ప్రభుత్వ అవసరాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలను ముఖం మీద అడగలేకపోతున్నాయి.. కానీ, వ్యాపార వర్గాలు సహా అందరూ విశాఖను పూర్తిగా వదిలేశారని అభిప్రాయంతో…