బెజవాడలో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. అక్రమ సంబంధానికి పాప అడ్డం వస్తుందని వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన శ్రీ రాములు అనే వ్యక్తి. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైఎస్సార్ కాలనీ కి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మొదటి భర్త ఆటో డ్రైవర్. కాగా ఏవో కారణాలతో విడిపోయి తన మూడేళ్ల కూతురుతో కలిసి విడిగా ఉంటోంది. ఈక్రమంలోనే కలరా హాస్పిటల్ దగ్గర నివసించే శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
Also Read:Honda Hness CB350: మూడు వేరియంట్లలో వచ్చేసిన కొత్త హోండా హ్నెస్ CB350
అయితే కొద్ది రోజుల క్రితం ఇద్దరు కలిసి హైదరాబాద్ కు వచ్చారు. కాగా వీరి అక్రమసంబంధానికి పాప అడ్డుగా మారడంతో శ్రీరాములుతో కలిసి పాపను చిత్రహింసలకు గురిచేస్తూ ఒంటిపై వాతలు పెడుతూ నరకయాతనకు గురిచేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి స్థానికుల సాయంతో పాపను తీసుకుని విజయవాడకు వచ్చేసింది. పాప విజయవాడకు వచ్చిందని తెలుసుకొని శ్రీరాములు ఆ పాప తల్లి ఇద్దరు కూడా ప్రస్తుతం విజయవాడ రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.